Begin typing your search above and press return to search.
ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ తో నో యూజ్
By: Tupaki Desk | 15 May 2018 8:30 AM GMTరాజకీయ నేత కానప్పటికీ ప్రముఖ సినీ నటుడు..తెర మీద తన యాక్షన్ తో చింపేసే ప్రకాశ్ రాజ్ కు కన్నడిగులు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చారు. మోడీ పేరు వింటే చాలు.. అంతెత్తు ఎగిరిపడే ఆయన మాటల్ని కన్నడిగులు లైట్ తీసుకున్నారు. బీజేపీ అన్నా.. ప్రధాని మోడీ అన్న తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాశ్ రాజ్.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు.
ఎలాంటి రాజకీయ పార్టీ అండ లేకుండానే తనకు తానే కర్ణాటక మొత్తం సొంత ఆసక్తితో పర్యటించారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సోషల్ మీడియాలో సంచలనాల మీద సంచలనాలు సృష్టించారు. తనసూటి ప్రశ్నలతో కమలనాథులకు కడుపు మండేలా చేశారు.
ప్రకాశ్ రాజ్ చేస్తున్న డ్యామేజ్ తో కర్ణాటక ఎన్నికల్లో తమకు ఎంతోకొంత నష్టం వాటిల్లుతుందని కమలనాథులు భావించారు. అయితే.. అందుకు భిన్నంగా బీజేపీకి ప్రజలు పట్టం కట్టటం.. ప్రకాశ్ రాజ్ ప్రభావం ఏమీ లేదని తలిపోయినట్లైంది.
కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెప్పకున్నా.. బీజేపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు అంటూ కాంగ్రెస్ కు ఓటు వేయాలన్న మాటను పరోక్షంగా చెప్పారు. అయినప్పటికీ ఆయన మాటల్ని ఓటర్లు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదని చెప్పాలి. సొంత రాష్ట్రంలో సొంత ప్రజల్ని ప్రకాశ్ రాజ్ ప్రభావితం చేయలేకపోయాడన్న మాట.. రానున్న రోజుల్లో ప్రకాశ్ రాజ్ నోటి వెంట మాట రాకుండా చేసేలా తాజా ఫలితాలు వెలువడ్డాయి. తాను స్టార్ట్ చేసిన జస్ట్ ఆస్కింగ్ ఏ మాత్రం ప్రజలకు ఎక్కలేదని.. సోషల్ మీడియాలో సటైర్లు వేసుకోవటానికే తప్పించి..ఓట్లు వేయించే విషయంలో ఆ ప్రచారం అక్కరకు రాలేదన్న మాట బలంగా వినిపిస్తోంది.