Begin typing your search above and press return to search.
కొత్త వివాదం: పొరుగు రాష్ర్టానికి సొంత జెండా
By: Tupaki Desk | 8 March 2018 9:57 AM GMTఎన్నికల హీట్‌తో...అగ్ర నాయకుల హాట్ కామెంట్లతో ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్న పొరుగు రాష్ట్రమైన కర్ణాటక మరోమారు సంచలన వార్తతో తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ తమ రాష్ర్టానికి ఒక ప్రత్యేక జెండా రూపొందించింది. రాష్ర్టానికి ప్రత్యేక జెండాను రూపొందించేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం గత ఏడాది జూలై నెలలోనే తొమ్మిది మందితో ఒక కమిటీని వేసింది. తాజాగా ఈ మేరకు జెండాను ఆవిష్కరించారు.
తాజాగా కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకంగా రూపొందిన రాష్ట్ర జెండాను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు ఆవిష్కరించారు. దీనిని ఆమోదం కోసం కేంద్రానికి పంపించనున్నారు. కేంద్రం ఆమోదించిన తరువాత దీనిని రాష్ట్ర జెండాగా ప్రకటిస్తారు. ఇదిలాఉండగా...మనదేశంలో ఇప్పటివరకు దేశంలో జమ్ముకశ్మీర్ కు తప్ప మరే ఇతర రాష్ర్టానికి ప్రత్యేక జెండా లేదు. అదే కోణలో కర్ణాటక సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం జాతి వ్యతిరేకమని బీజేపీ - శివసేన విమర్శించాయి. అయితే రాష్ర్టాలకు ప్రత్యేక జెండాలు ఉండకూడదని రాజ్యాంగంలో లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ర్టాలకు ప్రత్యేక జెండా ఉండరాదని రాజ్యాంగంలో ఉంటే ఎవరైనా చదివితే చెప్పాలని సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు.
కాగా, కన్నడ రచయిత - పాత్రికేయుడు పాటిల్ పుత్తప్ప - సామాజిక కార్యకర్త భీమప్ప గుండప్పల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కన్నడ - సాంస్కృతిక విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో ఆ కమిటీని వేసింది. ఈ కమిటీలో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు - కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు - కన్నడ అభివృద్ధి సంస్థ చైర్మన్ - కన్నడ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సభ్యులుగా ఉన్నారు. చట్టపరమైన అంశాలను పరిశీలించడంతోపాటు జెండాలో ఏయే రంగులు ఉండాలో నిర్ణయించే పనిని ఈ కమిటీకి అప్పగించింది.
కాగా, కర్ణాటకలో ఇప్పటికే ఎరుపు - నలుపు రంగులతో ఉన్న జెండాను రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ ఒకటిన అనధికారికంగా ఆవిష్కరిస్తున్నారు. ఈ జెండాను కన్నడ హక్కుల కార్యకర్త వీర సేనాని మా రామమూర్తి 1960లో డిజైన్ చేశారు. ఇంతకుముందు డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2012లో, రెండు రంగుల కన్నడ జెండాను అధికార పతాకంగా ఆమోదించేందుకు నిరాకరిస్తున్నామని రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. రాష్ర్టానికి ప్రత్యేక జెండా ఉండటం దేశ సమైక్యతకు - సమగ్రతకు వ్యతిరేకమని తెలిపింది. జెండా రూపకల్పన సమయంలోనే వివాదం రేగగా..ఏ రాష్ట్రానికా రాష్ట్రం ప్రత్యేక జెండాను రూపొందించుకునే అవకాశం భారత రాజ్యాంగంలో లేదని, త్రివర్ణ పతాకమొక్కటే అందరి జెండా అని కేంద్రం స్పష్టం చేసింది. ‘మనది ఒకే దేశం.. ఒకే జెండా. అయితే ఏ రాష్టమ్రైనా సొంత జెండా కలిగి ఉండడాన్ని లేదా అలాంటి ప్రయత్నాన్ని నిషేధించే న్యాయపరమైన నిబంధన ఏమీ లేదు’ అని హోం శాఖ ప్రతినిధి వివరించారు.