Begin typing your search above and press return to search.
ప్రధాని కార్యక్రమం.. కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం!
By: Tupaki Desk | 12 Jan 2023 11:30 AM GMTజనవరి 12 స్వామి వివేకానంద జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కర్ణాటకలో నిర్వహించతలపెట్టిన కర్ణాటక యూత్ ఫెస్టివల్ వివాదానికి ఆజ్యం పోసింది. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రతి కాలేజీ నుంచి విద్యార్థులను పంపాలని కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బెంగళూరులోని రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో నేషనల్ యూత్ ఫెస్టివల్ ను జరపాలని నిర్ణయించారు. స్వయంగా ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమం కావడంతో భారీ ఎత్తున విజయవంతం చేయాలని కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి కాలేజీకి 100 మంది చొప్పున ప్రతీ కాలేజ్ నంచి విద్యార్ధుల్ని పంపాలని కర్నాటక ప్రీ యూనివర్శిటీ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అన్ని కాలేజీలకు పంపింది. ఈ ఆదేశాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రతి కాలేజీ పాటించాలని ఆదేశించింది. దీంతో చిచ్చు రాజుకుంది.
ప్రీ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ ను ఉద్దేశించి పంపిన ఈ సర్క్యులర్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కళాశాలల విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు వాడటం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విద్యను కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కాషాయికరణ చేస్తోందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో అధికారులు కూడా దీనిపై వివరణ ఇచ్చారు. విద్యార్ధుల్ని ప్రధాని మోడీ సభకు తప్పకుండా తరలించాలని తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులు మాత్రమే పాల్గొనాలని కోరినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవ్వడంతో ఆ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారులు పంపిన ఉత్తర్వులను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు అపార్ధం చేసుకున్నారని, అందుకే దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని అధికారులు చెబుతుండటం కొసమెరుపు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.