Begin typing your search above and press return to search.
కరోనా సాకుతో పాఠ్యపుస్తకాల్లో చరిత్రను తొలగిస్తున్నారా?
By: Tupaki Desk | 30 July 2020 11:30 PM GMTకరోనాతో విద్యావ్యవస్థ పడకేసింది. చదువులకు విద్యార్థులు దూరమైపోయారు. కరోనా రోజురోజుకు తీవ్రంగా ప్రబలుతుండడంతో అది ఎప్పుడు తగ్గుతుందో.. విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక అయోమయంలో ఉన్నారు.
దీంతో ప్రభుత్వాలన్నీ పాఠ్యపుస్తకాల సిలబస్ ను తగ్గించాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఇప్పుడు ప్రాథమిక , మాధ్యమిక విద్యా విభాగం పాఠ్య పుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్ పాఠాన్ని తొలగించింది. దాంతోపాటు శివాజీ, విజయనగర సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు.. రాజ్యాంగంలోకి కొన్ని భాగాలు.. ఇస్లాం, క్రైస్తవ మతాలకు సంబంధించిన కొన్ని భాగాలను తొలగించింది. దీనికి కరోనా వైరస్ ను కారణంగా చూపిస్తోంది కర్ణాటక ప్రభుత్వం.
టిప్పు సుల్తాన్ సహా ముస్లిం రాజుల సిలబస్ ను తగ్గించమని చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వాన్ని అప్పట్లో నిలదీశారు. ఇప్పుడు బీజేపీ యడ్యూరప్ప ప్రభుత్వం అదే పనిచేసిందన్న విమర్శలున్నాయి.
కానీ రాజకీయ చరిత్రలు, సైన్స్ మాత్రమే కాకుండా చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చరిత్రే మనకు చాలా విషయం చెబుతుంది. దీంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బీజేపీ సిలబస్ తగ్గింపుపై మండిపడుతున్నాయి.