Begin typing your search above and press return to search.
బస్సు మీద జై మహారాష్ట్ర నినాదం..దేశద్రోహం కేసు!
By: Tupaki Desk | 4 Jun 2017 6:11 AM GMTఒక బస్సు మీద జై మహారాష్ట్ర అన్న నినాదం రాస్తే.. దేశ ద్రోహం కేసు పెట్టే ఛాన్స్ ఉందా? అంటే.. ఎవరైనా సరే.. ఎందుకు పెడతారు? అని అడుగుతారు. కానీ.. ఈ ప్రశ్న వేయటానికి వీలు కూడా లేకుండా కేసుల మీద కేసులు పెట్టేయటానికి సిద్ధమవుతోంది కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారు. మహారాష్ట్రకు చెందిన ఎర్రబస్సు మీద జై మహారాష్ట్ర అన్న నినాదం రాసి వచ్చిన బస్సుపై కర్ణాటక అధికారులు భారీ నేరం మోపటం.. కేసును నమోదు చేయటం ఇప్పుడు సంచలనం గా మారింది. ఎవరికి నేరంగా అనిపించని జై మహారాష్ట్ర నినాదం.. కర్ణాటకకు మాత్రం ఎందుకంత ఆగ్రహాన్ని తెప్పించిందన్నది చూస్తే.. ఈ ఇష్యూలో చాలనే ఇష్యూలు ఉన్నాయని చెప్పక తప్పదు.
మహారాష్ట్ర సరిహద్దుల్లోని బెల్గాం జిల్లా ఉండేది కర్ణాటకలో. అయితే.. ఇక్కడి వారిలో ఎక్కువ మంది మరాఠీనే మాట్లాడతారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాను మహారాష్ట్రలో కలపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే.. ఈ డిమాండ్ కు అక్కడి ప్రజల నుంచి పెద్దగా మద్దతు రాలేదు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో పవర్ లోకి వచ్చిన బీజేపీ- శివసేన సర్కారు.. ఈ నినాదాన్ని బయటకు తీసింది. ఇందులో భాగంగా ముంబయి నుంచి బెల్గాంకు వెళ్లే మహారాష్ట్ర ఆర్టీసీ బస్సుల మీద జై మహారాష్ట్ర అన్న నినాదాన్ని రాయించారు.
ఈ వ్యవహారం కర్ణాటక రాష్ట్ర సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. ఈ నినాదంతో ఉన్న బస్సు బెల్గాంలో స్వాగతం పలికేందుకు శివసేన.. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి ఏర్పాట్లు చేశాయి. ఇలాంటి విభజన చర్యల్ని మొదట్లోనే తుంచేయాలన్న ఉద్దేశంతో కర్ణాటక సర్కారు తీవ్ర చర్యలు చేపట్టింది.
జై మహారాష్ట్ర నినాదం ఉన్న బస్సును స్వాగతం పలికేందుకు రెఢీ అయిన వారిపైనా.. బస్సు డ్రైవర్.. కండెక్టర్ మీదా దేశ ద్రోహం నేరాన్ని ఆరోపిస్తూ కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. కన్నడ గడ్డపై మరాఠాకు అనుకూలంగా నినాదాలు చేస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని.. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడమని కర్ణాటక మంత్రి రోషన్ బేగ్ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కర్ణాటక సర్కారు డిమాండ్ చేస్తుంది. విభజన వాదాన్ని పెంచేందుకు తీసుకునే ఏ చర్యనైనా తాము అడ్డుకొని తీరుతామని..అందుకు ఎంత దూరమైనా వెళతామంటూ కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు తెగేసి చెప్పటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/