Begin typing your search above and press return to search.

కర్ణాటక సర్కారు సంచలనం.. బెంగళూరులో ఓలా.. ఉబర్.. ర్యాపిడో బ్యాన్

By:  Tupaki Desk   |   8 Oct 2022 4:45 AM GMT
కర్ణాటక సర్కారు సంచలనం.. బెంగళూరులో ఓలా.. ఉబర్.. ర్యాపిడో బ్యాన్
X
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. క్యాబ్ సర్వీసుల్ని అందించే ప్రముఖ ఆగ్రిగేటర్లు అయిన ఓలా.. ఉబర్.. ర్యాపిడోలకు దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తూ కర్ణాటక రవాణా శాఖ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

నిబంధనల్ని పాటించకుండా.. ఇష్టారాజ్యంగా దోచేస్తున్న ఆటో ఫెయిర్లపై మండిపడింది. నిబంధనల కొరడా ఝుళిపించి.. రానున్న మూడు రోజుల్లో ఈ సర్వీసులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఓలా.. ఉబర్.. ర్యాపిడో ఆటో సర్వీసులు నిబంధనల్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదని మండిపడింది. రెండు కి.మీ. దూరానికి రూ.100 ఛార్జ్ చేస్తున్న వైనాన్ని తప్పు పడుతూ.. చర్యలకు తెర తీసింది. పలువురు ఇచ్చిన కంప్లైంట్లను ఆధారంగా చేసుకొని నోటీసులు జారీ చేసింది. తమ వివరణ ఇవ్వాలని సంస్థలకు స్పష్టం చేసింది.

ప్రయాణ దూరం రెండు కిలో మీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ రూ.100 వసూలు చేయటాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో కనీస ఆటో ఛార్జి మొదటి రెండు కిలోమీటర్లకు రూ.30 మాత్రమే వసూలు చేయాలి. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు రూ.15 చొప్పున మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది.

అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న వైనాన్ని తప్పు పట్టింది. నిబంధనలకు మించి ఎక్కువ వసూలు చేయొద్దని తాజాగా జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.

తమ ఆదేశాల్ని పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. బెంగళూరులో వాహన ఆగ్రిగేటర్లకు షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వాన్ని చూసైనా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.