Begin typing your search above and press return to search.

కరోనాలోనూ దూసుకుపోయిన కర్ణాటక..10 వేల కోట్ల పెట్టుబడులు!

By:  Tupaki Desk   |   24 Oct 2020 1:30 AM GMT
కరోనాలోనూ దూసుకుపోయిన కర్ణాటక..10 వేల కోట్ల పెట్టుబడులు!
X
కరోనా ధాటికి యావత్​ ప్రపంచమే విలవిల లాడుతున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక రాష్ట్రం మాత్రం ఆర్థికంగా దూసుకుపోతోంది. పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు దూసుకుపోతోంది. బీజేపీ పాలిత రాష్ట్రం కావడం కూడా ఆ రాష్ట్రానికి కలిసొచ్చింది. యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది. గత ఏప్రిల్​ - జూన్​ మధ్యకాలంలో కర్ణాటక రాష్ట్రానికి రూ 10,225 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో అన్ని పెట్టుబడులు రావడం నిజంగా రికార్డే. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాకు తెలిపారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే పది వేలకు కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు వివరించారు.

‘అభివృద్ధిలోనూ రాష్ట్రానికి నూతన పెట్టుబడులు తీసుకురావడంలోనూ మేము ఎంతో కృషి చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు మాకు ఎంతో సహకరించాయి. రాష్ట్రంలోని ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎఫ్​డీఐ ల ద్వారా మా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక పెట్టుబడులకు ఎంతో అనుకూలం. కొత్తగా వచ్చిన పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నాను’ అని చెప్పారు యడియూరప్ప.