Begin typing your search above and press return to search.
గాలికి భారీ రిలీఫ్ ఇచ్చేసిన కోర్టు
By: Tupaki Desk | 15 March 2017 8:44 AM GMTకొన్ని విషయాల్లో మీడియా తీరు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ మధ్యన మీడియా ఈగో మీద ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన మనలో ఒకడు మూవీ గుర్తుందా? ఆ సినిమా గురించి ఆర్పీ ఒక విలువైన మాట చెప్పారు. తప్పు జరిగిందంటూ ఆరోపణ వచ్చేసిన మరుక్షణం మీద పడిపోయే మీడియా.. తప్పు కాదన్న విషయం తేలిన తర్వాత ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. తప్పు చేయలేదన్న విషయాన్ని న్యాయస్థానాలు తేల్చేసిన తర్వాత ఆ విషయాన్ని బురద జల్లేసినంత భారీగా కాకున్నా.. ఒక మోస్తరుగా అయినా వార్త ఎందుకు వేయరంటూ ప్రశ్నించారు.
తాజాగా గాలి ఉదంతాన్ని చూస్తే.. ఈ విషయం ఎంత నిజమో ఇట్టే అర్థమవుతుంది. అక్రమ మైనింగ్ పేరుతో గాలికి చెందిన ఆస్తుల్నిఈడీ అటాచ్ చేసినప్పుడు పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టేసి రచ్చ రచ్చ చేసేసి తెలుగు మీడియా.. తాజాగా ఆయన ఆస్తుల్ని అటాచ్ మెంట్ నుంచి బయటకు వచ్చేసిన విషయాన్ని చిన్న ముక్కగా కూడా వేయకపోవటాన్ని చూడొచ్చు. తాజాగా కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో గాలికి చెందిన ఆస్తులు దాదాపు రూ.884 కోట్ల విలువైనవి అటాచ్ నుంచి బయటకు వచ్చేశాయి.
అధికారిక విలువల ప్రకారం రూ.884కోట్లు చెబుతున్నా.. మార్కెట్ విలువ విషయానికి వస్తే ఇది మరింత ఎక్కువగా వచ్చిందని చెబుతున్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తులు గత కొన్నేళ్లుగా అటాచ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ గాలి ఫ్యామిలీకి వెళ్లిపోయాయి. తాజా కోర్టు తీర్పుతో ఈ విలువైన ఆస్తులన్ని గాలి కష్టార్జితం కిందకు వెళ్లిపోయినట్లే లెక్క. మరీ విషయాన్ని తెలుగు మీడియా ఎందుకు కవర్ చేయటం లేదన్నది ప్రశ్న.
ఇటీవల కాలంలో గాలికి అంతా కలిసి వస్తున్నట్లుగా చెప్పాలి. అప్పట్లో ఎంత ప్రయత్నించినా దొరకని బెయిల్.. పలు ప్రయత్నాల అనంతరం బెయిల్ వచ్చేసి బయటకు వచ్చేశారు. తర్వాత కూతురు పెళ్లిని గ్రాండ్ గా చేశారు. ఆయన చేసిన హడావుడికి.. మీడియా కవరేజ్ పుణ్యమా అని పెళ్లి వేడుకలు ముగిసినంతనే ఐటీ శాఖ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించినా.. ఆయనకేమీ కాలేదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా ఈడీ అటాచ్‌మెంట్లో ఉన్న ఆస్తులు కూడా బయటకు రావటం చూస్తుంటే.. గాలికి బ్యాడ్ టైమ్ పూర్తి అయినట్లేనన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/