Begin typing your search above and press return to search.

రాజీనామా స‌వాల్‌..క‌ర్ణాట‌క‌లో మ‌రోమారు రాజ‌కీయ సంక్షోభం

By:  Tupaki Desk   |   8 Feb 2019 4:55 PM GMT
రాజీనామా స‌వాల్‌..క‌ర్ణాట‌క‌లో మ‌రోమారు రాజ‌కీయ సంక్షోభం
X
క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం మ‌రోమారు ర‌స‌కందాయంలో ప‌డింది. ఆ రాష్ట్రంలో అధికార ప్ర‌తిప‌క్షాలు మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని కూల్చే ఎత్తుగ‌డ‌లు అంటూ విమ‌ర్శ‌లు- ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి - మాజీ ముఖ్య‌మంత్రి యడ్యూర‌ప్ప మ‌ధ్య ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు సాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడకు డబ్బు ఎరవేస్తున్న అంశానికి సంబంధించిన ఆడియో టేపును కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేశారు. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కుమారస్వామి పేర్కొన్నారు. అయితే, సీఎం వ‌న్నీ అబ‌ద్దాలేన‌ని...నిరూపిస్తే తాను రాజీనామా చేస్తాన‌ని య‌డ్యుర‌ప్ప ప్ర‌క‌టించారు.

బెంగ‌ళూరులో సీఎం కుమార‌స్వామి మీడియాతో మాట్లాడుతూ...ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసేందుకు బీజేపీ ఎటువంటి కుయుక్తులు పన్నిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని అన్నారు. తాము బడ్జెట్‌ ను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప మధ్యవర్తుల ద్వారా జేడీఎస్‌ ఎమ్మెల్యేకు డబ్బు ఎర వేస్తున్నట్లుగా ఉన్న ఆడియో టేపును కర్ణాటక సీఎం కుమారస్వామి శుక్రవారం విడుదల చేశారు. ఆప‌రేష‌న్ లోట‌స్ పేరుతో ఇంకా బీజేపీ త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడ కుమారుడు శరణకు యడ్యూరప్ప ఫోన్ చేసి తమకు మద్దతిస్తే రూ. 25 లక్షలు ఇస్తామని - నాన్నకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారని కుమారస్వామి తెలిపారు. వీటన్నింటిపై ఆధారాలతో సహా రుజువు చేస్తా. మా ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడట్లేదు` అని వాపోయారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక వైపు మాత్రం ప్రధాని మోడీ సత్యాలు వల్లెవేస్తున్నారు. మరోవైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు అని కుమారస్వామి మండిపడ్డారు.మోడీ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందన్నారు.

కాగా, కుమార‌స్వామి ఆరోప‌ణ‌ల‌పై య‌డ్యుర‌ప్ప స్పందించారు. అదంతా అబద్ధమని, తనను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సీఎంకు సవాల్ విసిరారు. ``జేడీఎస్ ఎమ్మెల్యే నాగన గౌడకు నేను డబ్బు ఎరవేసేందుకు ప్రయత్నించానని చేసిన ఆరోపణలు అవాస్తం. నేను ఎవరిని కలవలేదు. నాగన గౌడ కుమారుడు శరణ్‌ గౌడ నన్ను కలిసినట్లు, నాతో మాట్లాడినట్లు రికార్డు చేశారు. అదంతా అబద్ధం. కుమారస్వామి ఓ నిర్మాత కదా. వాయిస్‌ రికార్డింగ్‌లో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుమారస్వామి ఈ డ్రామా ఆడుతున్నారు` అని ఎద్దేవా చేశారు