Begin typing your search above and press return to search.
తండ్రులు చేసే అప్పులపై కుమారులకు హైకోర్టు సంచలన ఆదేశాలు!
By: Tupaki Desk | 14 Jan 2023 12:30 AM GMTతండ్రి అప్పు చేసి మరణిస్తే వాటిని తీర్చే బాధ్యత కుమారులదేనని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ఇదే విషయాన్ని చెబుతోందని వెల్లడించింది. ఈ చట్టం ప్రకారం.. తండ్రి అప్పులు చేసి చనిపోతే.. అతను చేసిన అప్పులను చెల్లించాల్సిన బాధ్యత కుమారులపైనే ఉంటుందని కర్ణాటక హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో భరమప్ప అనే వ్యక్తి 2003లో ప్రసాద్ రేకార్ అనే వ్యక్తి నుంచి రూ.2.60 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇందునిమిత్తం ఈ మొత్తానికి రెండు చెక్కులు ఇచ్చాడు. తర్వాత కొద్ది రోజులకు అప్పు తీసుకున్న భరమప్ప మరణించాడు.
దీంతో అప్పు ఇచ్చిన ప్రసాద్ రేకార్... మృతుడు భరమప్ప కుమారుడు దినేష్ ని తన అప్పు తీర్చాలని కోరాడు. అయితే అప్పు చేసింది తన తండ్రి అని.. ఆ అప్పుతో తనకెలాంటి సంబంధం లేదని దినేష్ తేల్చిచెప్పాడు. దీంతో అప్పు ఇచ్చిన ప్రసాద్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసును విచారించిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి చేసిన అప్పులతో తనకు సంబంధం లేదన్న దినేష్ వాదనను ఖండించింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 29 ప్రకారం.. తండ్రి చనిపోతే... అప్పులు తీర్చాల్సిన బాధ్యత కుమారుడిపైనే ఉంటుందని తేల్చిచెప్పింది. తండ్రి చేసిన అప్పులను దినేష్ కచ్చితంగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
అలాగే దినేష్ తండ్రి తీసుకున్న అసలు రూ.2.25 లక్షలు, వడ్డీ నెలకు రూ.100కు రూ.2 వడ్డీతో చెల్లించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భరమప్ప.. మరణించేవరకు రూ.10 వేలు మాత్రమే వడ్డీ చెల్లించాడని తేలింది.
ఈ నేపథ్యంలో భరమప్ప ఓసారి తాను చెల్లించాల్సిన అప్పులకు సంబంధించి తనకు అప్పు ఇచ్చిన ప్రసాద్ కు రెండు చెక్కులు ఇచ్చాడు. కానీ అవి బ్యాంకులో చెల్లలేదు. దీంతో అతడు భరమప్ప తనయుడిని తన అప్పు ఇవ్వాలని అడిగాడు. అయితే అతడు తనకు సంబంధం లేదనడంతో ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించాడు.