Begin typing your search above and press return to search.

ప్లీజ్... బెంగుళూరులోనే ఉండండి !

By:  Tupaki Desk   |   6 July 2020 6:08 PM GMT
ప్లీజ్... బెంగుళూరులోనే ఉండండి !
X
తప్పు జరిగితే గాని తత్వం బోధపడదు అన్నట్టుంది ప్రభుత్వాల పరిస్థితి. కరోనాతో ప్రభుత్వాలకు ఎన్నో జ్జానోదయాలు అవుతున్నాయి. కోవిడ్ ను కంట్రోల్ చేయడానికి లాక్ డౌనే ఆయుధం అని, దాంతో కొంత భారం తగ్గించుకోవచ్చని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ఇది పరోక్షంగా కరోనా వ్యాప్తిని ఇతర ప్రాంతాలకు వ్యాపింపజేస్తోంది. ఈ నేపథ్యంలో బెంగుళూరులో ఇకపై లాక్ డౌన్ పెట్టే సమస్యే లేదు అని కర్ణాటక హోం మంత్రి బసవరాజు ప్రకటించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే... వరుస లాక్ డౌన్ ల తర్వాత అది ఓపెన్ చేయగానే జనం మెల్లగా సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రూరల్ కర్ణాటకలో కరోనా వ్యాప్తి పెరిగిపోయింది. పిడికిల్లో ఇసుకను బిగిస్తే సందుల్లో దూరిపోయినట్టు... బెంగులూరులో కేసులు తగ్గిద్దాం అని చేసిన ప్రయత్నం గ్రామాల్లో కరోనా పెరిగేలా చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. మీకు మాటిస్తున్నాం. ఇకపై బెంగుళూరులో లాక్ డౌన్ పెట్టే సమస్యే లేదు. భయపడకండి. జాగ్రత్తగా ఇక్కడే ఉండండి. మీరు ఊళ్లకెళ్లి కరోనా వ్యాప్తికి కారణం కావద్దని ప్రజలకు విజ్జప్తి చేసింది. కేవలం ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం పెడతాం అన్నారు.

మంత్రిగారు మరో సలహా ఇచ్చారు. బెంగళూరులో కరోనా రోగులకు బెడ్‌ల కొరత లేదు అని... లక్షణాలు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లలో పెడుతున్నాం అన్నారు. మంచి సదుపాయాలున్నాయని ఎవరికీ కరోనా చికిత్స గురించి ఆందోళన అవసరం లేదన్నారు. బహుశా ఈ సూచన హైదరాబాదు విషయంలో పాటిస్తే మంచిదే. దీనిని తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుంటే జిల్లాల్లో వ్యాప్తి తగ్గే అవకాశం ఉంది.