Begin typing your search above and press return to search.
వైరల్ గా మారిన సర్కారీ ఆసుపత్రి
By: Tupaki Desk | 2 Jun 2017 1:35 PM GMTబతికి ఉండే బలుసాకు తినొచ్చు కానీ ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తీసుకెళ్లొద్దంటూ కొందరు వేడుకోవటం కనిపిస్తుంది. వందల కోట్ల రూపాయిలు ఆసుపత్రుల బడ్జెట్ కిందకు వెళుతున్నా.. కనీస వసతులు లేకపోవటం.. వైద్యం కోసం వచ్చిన వారిని మనుషులుగా కూడా చూడని వైనం చాలా సర్కారీ ఆసుపత్రుల్లో కనిపిస్తుంటుంది. సర్కారు దవాఖానాలో పరిస్థితులు ఎలా ఉంటాయనటానికి నిలువెత్తు నిదర్శనంగా ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పేదరికంతో బతకటం ఎంత నరకప్రాయమో చెప్పటమే కాదు.. వృద్ధవయస్కులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పే ఉదంతమిది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తాజా వీడియో వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని శివమొగ్గ పట్టణంలోని మెగాన్ అనే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రికి అమీర్ సాబ్.. ఫమీదా అనే వృద్ధ దంపతులు వచ్చారు. కదల్లేని స్థితిలో ఉన్న భర్త అమీర్ సాబ్ ను ఆపసోపాలు పడి మరీ ఆసుపత్రికి తీసుకొచ్చింది ఫమీదా. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు ఎక్స్ రే తీసుకురావాలన్నారు. ఎక్స్ రే రూంకు వెళ్లేందుకు సిబ్బంది సాయం రాకపోవటంతో.. అక్కడున్న వారిని సాయం అడిగిందా వృద్ధ మహిళ. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవటంతో.. నిస్సహాయంతో.. భర్త కాళ్లను లాక్కుంటూ ఎక్స్ రే రూం వరకూ లాక్కెళ్లింది.
ఈ ఉదంతాన్ని అక్కడే ఉన్న ఒకరు చూసి.. గుట్టుగా వీడియో తీశారు. ఎక్స్ రే రూం దగ్గర సిబ్బంది సైతం పరుషంగా మాట్లాడిన వైనాన్ని రికార్డు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. మెగాన్ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎంత దారునంగా ఉందన్న విషయాన్ని చెబుతూ ట్యాగ్ చేశారు.
దీంతో.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై వైద్యాధికారులు సీరియస్ అయి.. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారటమే కాదు.. వృద్ధ దంపతులపై ఆసుపత్రి సిబ్బంది ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడుతున్నారు. వృద్ధులని కూడా చూడకుండా.. కనికరం అన్నది లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని.. వారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కారు మాత్రం ఇప్పటివరకూ రియాక్ట్ కాకపోవటంపై పలువురు మండిపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/