Begin typing your search above and press return to search.
హైదరాబాద్‌లో కరోనా మరణం...బెంగళూరు మంత్రి ఆసక్తికర కామెంట్
By: Tupaki Desk | 11 March 2020 3:31 PM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశం ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేయడం కరోనా కరాళ నాట్యాని కి అద్దం పడుతోంది. మనదేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈశాన్య రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నాయి. మిజోరం సోమవారమే మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేసింది. ఇలా హైఅలర్ట్ కొనసాగుతున్న సమయం లో...హైదరాబాద్‌లో కరోనా మరణం సంభవించిందని ప్రచారం జరుగుతుండటం కలకలం రేకెత్తిస్తోంది.
కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తి హైదరాబాద్‌లో 'కరోనా వైరస్' సోకి మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. 76 సంవత్సరాలున్న సిద్ధిఖీ ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చాడు. అయితే ఆయనకు కరోనా వైరస్ సోకిందని భావించి హైదరాబాద్‌లో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో ఆయన మరణించడం, దానికి కరోనా కారణమని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
సిద్ధిఖీ కర్ణాటక వాసి కావడంతో కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు స్పందించారు. ప్రజల్లో రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కన్నడ భాషలో ఓ ట్వీట్ చేశారు. మృతి చెందిన వ్యక్తి కరోనా వ్యాధి అనుమానితుడని పేర్కొన్న మంత్రి శ్రీరాములు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఇదిలాఉండగా, మార్చి 31వ తేదీ వరకు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. పెళ్లిళ్లకు కూడా దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫంక్షన్ల తో పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని సీఎం చెప్పారు.