Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై కాంగ్రెస్ మంత్రి ప్రశంసలు..చర్యలు రెడీ
By: Tupaki Desk | 30 Dec 2017 11:46 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించినందుకు ఓ మంత్రిపై క్రమక్షణ చర్యలకు రంగం సిద్ధమైంది. పొరుగు రాష్ట్ర మంత్రి తమ సీఎంను మెచ్చుకున్నందుకు టీఆర్ ఎస్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తుండగా...తమ ప్రత్యర్థిని ప్రశంసించారని కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా కర్ణాటక రవాణా శాఖ మంత్రి రేవణ్ణ గురించి! కోకాపేటలో గొల్ల - కుర్మ సంక్షేమ భవనాలు - హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి రేవణ్ణ ప్రసంగించి రైతులకు 24 గంటల విద్యుత్ ను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వంను ప్రసంశించారు.
దేశంలోనే గొర్రెలను పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రేవణ్ణ తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరంగా పనిచేస్తున్న ఘనత ముఖ్యమంత్ర కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న గొల్ల - కురుమల కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తున్నందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి రేవణ్ణ కృతజతలు తెలిపారు. అయితే ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. తమ రాష్ర్టానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేయడంపై మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీకి పిర్యాదు చేసింది.
తెలంగాణ నేతల ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌సీ కుంతియా రంగంలోకి దిగారు. తెలంగాణకు వచ్చి సీఎం కేసీఆర్ ను పొగడటంపై సీరియస్ అయ్యారు. రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటుగా కర్ణాటక ఇంచార్జీ కేసీ వేణుగోపాల్ - ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాస్తానని కుంతియ వెల్లడించారు.