Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో గే సెక్స్ వీడియో.. ఎమ్మెల్యే ఆవేదన!
By: Tupaki Desk | 23 July 2019 8:39 AM GMTప్రజల్లో తమ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతోందని కర్ణాటక ఎమ్మెల్యేల్లో కొందరు వాపోతూ ఉన్నారు. గత కొన్ని రోజుల పరిణామాలతో ప్రజలంతా కర్ణాటక ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటున్నారని అక్కడి నేతలు అంటున్నారు. అసెంబ్లీ వేదికగానే వారు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయంలో సూటిగా స్పందిస్తూ ఉన్నారు. రాజకీయ అనిశ్చితి ప్రజల్లో నేతల ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉందని వారు వ్యాఖ్యానించారు.
ఆ సంగతలా ఉంటే..తన పేరుతో ఒక గే సెక్స్ వీడియోను వెబ్ లో పెట్టారంటూ బీజేపీ ఎమ్మెల్యే అరవింద లింబావళి వాపోయారు. ఆ వీడియోను సైతం ఆయన అసెంబ్లీలో ప్రదర్శించారు. తనను డీఫేమ్ చేయడమే లక్ష్యంగా కొందరు ఆ వీడియోను పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఫేక్ వీడియోను పెట్టి తనపై రాజకీయ కుట్ర చేయాలని కొంతమంది చూస్తున్నారని ఆయన వాపోయారు. ఆ ఫేక్ వీడియో వల్ల తను మాత్రమే కాకుండా తన కుటుంబీకులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
ఈ విషయంలో ఆయనను స్పీకర్ సముదాయించారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు అయినట్టుగా తెలుస్తోంది. ఆ నకిలీ వీడియోను పోస్టు చేసిన వారెవరో కనుక్కొనే పనిలో తాము ఉన్నట్టుగా కర్ణాటక పోలీసులు ప్రకటించారు.