Begin typing your search above and press return to search.
హనీట్రాప్..ఆ జాతీయ పార్టీ నేత ఎవరు?
By: Tupaki Desk | 1 Dec 2019 5:46 AM GMTఅమ్మాయి లంటే వ్యామోహం ఉన్నవారిని - శ్రీమంతులను లక్ష్యంగా చేసుకుని వలపు వలను విసిరి - వారి వ్యక్తిగత సరదాలను తీర్చే నెపంతో రహస్యాలను చేజిక్కుంచుకొని...అందిన కాడికి డబ్బు - అవసరాలను చక్కబెట్టుకునే మూట కర్ణాటకలో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు - మాజీ మంత్రులను టార్గెట్ చేసుకుని హనీట్రాప్ దందా సాగిస్తున్న ఇద్దరు యువతులతోపాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, బడా నాయకులతో పరిచయాలు పెంచుకుని రహస్య వీడియోలు తీసి బెదిరిస్తున్న ఘరానా హనీ ట్రాప్ ముఠా చరిత్రను తవ్వుతున్న కొద్దీ సంచలన నిజాలు బయటపడుతున్నాయి.సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న ముఠా కీలక సభ్యుల సెల్ ఫోన్లు - కంప్యూటర్లు తదితరాల్లో నాయకుల శృంగార వీడియోలు అనేకం బయటపడినట్లు సమాచారం.ఓ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో ఏడుగురు ముఖ్యనేతల రాసలీలలు ఉన్నట్లు తెలుస్తోంది.
కొందరు బుల్లితెర నటీమణులు పథకంలో భాగంగా మంత్రులు - మాజీమంత్రులు - ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్యేలు - లోక్ సభ సభ్యులు - ఉన్నతాధికారుల వద్దకు వెళ్లేవారు. వారినుంచి మొబైల్ నంబర్లు తీసుకుని - తరచు చాట్ చేసేవారు. చివరికి.. వారిని ముగ్గులోకి దించి - ముందుగా అమర్చుకున్న రహస్య కెమెరాల్లో వారి రాసలీలలు రికార్డు చేసేవారు. ఇలా హనీట్రాప్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యేల గురించి పోలీసులు అధికారికంగా వెల్లడించనప్పటికీ....ఈ రాసలీలల దందాలో చిక్కుకున్న వారిలో కళకప్పబండి - రఘుపతి భట్ - రఘుపతి ఆచార్ - శివరాం హెబ్బార - గళిహట్టి శేఖర్ - రాజశేఖర్ పాటిల్ తోపాటు పలువురు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేతలను బుక్ చేసిన వారిలో కర్ణాటకలోని పరప్పన అగ్రహారకు చెందిన రాఘవేంద్ర - మంజునాథ్ లతోపాటు కోరమంగలకు చెందిన పుష్ప - బనశంకరికి చెందిన పుష్పలను అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను హనీట్రాప్ చేసిన మేరకు నమోదైన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు మీడియాకు తెలిపారు. కీలక నిందితుడు రాఘవేంద్ర - అతని ప్రియురాలు తదితరుల నుంచి సీసీబీ పోలీసులు స్వాదీనం చేసుకున్న ఎల్రక్టానిక్స్ పరికరాల్లో పదిమందికి పైగా ప్రజాప్రతినిధులు - మాజీమంత్రుల వీడియోలు లభ్యమయ్యాయని సమాచారం.
వీడియోలు అడ్డుపెట్టుకుని 2015 నుంచి వీరు తమ నేరాలను కొనసాగిస్తున్నారని గుర్తించినట్లు భాస్కరరావు తెలిపారు. మధ్యప్రదేశ్ లో ఇటీవల వెలుగుచూసిన ‘హనీట్రాప్’ ఘటన కన్నా ఇది పెద్దదని ఆయన చెప్పారు. తొలుత ఈ కేసులో రాఘవేంద్ర అలియాస్ రాఖీసింగ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అనుమానించినా... చివరకు ఓ జాతీయపార్టీకి చెందిన సీనియరు నాయకుడు దీని వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు - మరో పదిమంది మాజీమంత్రుల నుంచి నిందితులు ఇప్పటికే రూ.కోట్ల నగదు వసూలుచేశారనే విషయం కూడా బయటపడింది. గదగ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హనీట్రాప్ ముఠాలో చిక్కుకోగా రహస్యంగా చిత్రీకరించడానికి రూ.10 లక్షలు ఇవ్వాలని సీరియల్ నటి ఆ ఎమ్మెల్యే రాజకీయ ప్రత్యర్థిని అడిగారు. చివరకు రూ.1 లక్ష చెల్లించారట.