Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : డీకే శివకుమార్ కు కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 25 Aug 2020 2:00 PM GMTదేశంలో కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. సామాన్యుల నుండి ప్రముఖులు ,ప్రజాప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీలు , మంత్రులు , ముఖ్యమంత్రులు కూడా కరోనా భారిన పడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత , కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కరోనా బారిన పడ్డారు. కరోనా నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు . కన్నడ నాట క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తోన్న శివ కుమార్.. ఈ మధ్య వరదల బారిన పడిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ జులై 2న ప్రమాణ స్వీకారం చేశారు. దానికంటే ఐదు నెలల క్రితమే అదిష్టానం ఆయన పేరు ప్రకటించినప్పటికీ.. కరోనా కారణంగా ఆయన ఆలస్యంగా బాధ్యతలను స్వీకరించారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఏర్పాటు సమయంలో, ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో, పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించడంలో డీకే ప్రముఖ పాత్ర వహించారు.
ఇకపోతే , కరోనా పాజిటివ్ గా వచ్చిన విషయాన్ని స్వయంగా అయన తెలియజేస్తూ .. మీ దీవెనలతో తాను ఆరోగ్యంగా తిరిగివస్తానని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. తనను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇకపోతే ఇప్పటికే కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. అలాగే , ఆరోగ్య మంత్రి శ్రీరాములు సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్‌తేలింది. ఇకపోతే , కరోనా పాజిటివ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక దేశంలో నాలుగో స్ధానంలో ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకూ 3.61 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ప్రస్తుతం 81 వేల యాక్టివ్ కేసులున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 4810 మంది మరణించారు. గత 24 గంటల్లో కర్ణాటకలో కొత్తగా 5851 కరోనా కేసులు నమోదయ్యాయి. 130 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.