Begin typing your search above and press return to search.
వెంకయ్యను వద్దంటున్న పొరుగు రాష్ట్రం
By: Tupaki Desk | 22 May 2016 9:34 AM GMTకేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజకీయ భవితవ్యంపై రాజకీయ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే మూడు దఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వెంకయ్యనాయుడు త్వరలో రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏ రాష్ట్రం నుంచి బరిలోకి దిగుతారనే చర్చ వినిపిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటకనుంచి వెంకయ్యను రాజ్యసభకు పంపవద్దనే అభిప్రాయా లు పెద్ద ఎత్తున్నే వినిపిస్తున్నాయి.
కర్ణాటకలో బీజేపీకి ఉన్న బలం ప్రకారం రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యే అవకాశం ఒక్కరికే ఉంది. చేతిలో ఉన్న ఏకైక సీటుకు ఎవర్ని నామినేట్ చెయ్యాలన్నదానిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప బుర్ర బద్దలు గొట్టుకుంటున్నారు. ఆయనకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తప్ప వేరే అవకాశం లేదు. అయితే వెంకయ్య అభ్యర్థిత్వాన్ని చాలా మంది కన్నడిగలు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. మంత్రిపదవిలో ఉండగా ఆయన రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని చాలా మంది విద్యావంతులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యడ్డీ ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్ర అధిష్టానం సూచనలను బట్టి నడుచుకునేందుకు యడ్యూరప్ప సిద్ధమయ్యారని సమాచారం.
కర్ణాటక విషయానికి వస్తే..రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మే 24న నోటిఫికేషన్ విడుదల కానుంది. సభ్యులను నామినేట్ చేయడానికి మే 31 చివరితేదీ .జూన్ 1న వీటిని పరిశీలించనున్నారు. వాటి ఉపసంహరణకు జూన్ మూడు చివరి తేదీ కాగా, జూన్11న ఓటింగ్ జరగనుంది. ఆ రోజు సాయంత్రమే కౌంటింగ్ జరగనుందని ఎన్నికల అధికారులు చెప్పారు.