Begin typing your search above and press return to search.

కన్నడిగుల అంత రచ్చ లోనే తమిళులకు నీళ్లు

By:  Tupaki Desk   |   7 Sept 2016 5:32 PM IST
కన్నడిగుల అంత రచ్చ లోనే తమిళులకు నీళ్లు
X
ప్రజాస్వామ్యంలో ఉన్న మేజిక్ అదే. కొన్నిసార్లు చట్టం ఎందుకు పనికి రానట్లుగా ఉంటుంది. మరోసారి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. అదెంత పవర్ ఫుల్ అన్నది అర్థమై ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంటున్న పరిణామాల్నే చూస్తే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కావేరీ జలాల్ని పది రోజుల పాటు తమిళనాడుకు విడవాల్సి ఉంది. దీనిపై కన్నడిగులు అగ్గి ఫైర్ అవుతున్నారు. కావేరీ జలాల్నివిడుదల చేసే మాండ్యా జిల్లా వాసులైతే ఆగమాగం చేసిన పరిస్థితి.

ఓపక్క కన్నడిగులు కోపోద్రికులైనప్పటికీ చట్టం మాత్రం తన పని తానుచేసుకుంటూనే పోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు తగ్గట్లే కావేరీ జలాల్ని తమిళనాడుకు విడుదల చేయటంతో నిరసనలు షురూ అయ్యాయి. రోజుకు 15వేల క్యూసెక్కుల నీటిని పది రోజుల పాటు విడుదల చేయాలని ఆదేశించిన నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది.

కర్నాటక ఈ విధంగా నీటిని విడుదల చేయటం వల్ల కన్నడనాట రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అలా అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకుండా ఉండలేరు. అందుకే.. ప్రజల నుంచి తీవ్రఆగ్రహం వ్యక్తమవుతున్నా కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారు మాత్రం తమిళనాడుకు నీటిని విడుదల చేస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే.. కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయటంపై కన్నడ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాండ్యా నగరంలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నిన్నటి వరకూ ఈ ఇష్యూ మీద నిరసనలు మాండ్యా వరకు పరిమితం కాగా ఈ రోజు బెంగళూరుకు కూడా పాకాయి. రైతుల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య దిష్టిబొమ్మతో పాటు.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దిష్టిబొమ్మల్ని దగ్థం చేస్తున్నారు. ఓపక్క సుప్రీం కోర్టు.. మరోపక్క తమ తలరాతలు రాసే ప్రజానీకం చేస్తున్న నిరసనలతో సిద్ధరామయ్య సర్కారు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదని చెప్పక తప్పదు.