Begin typing your search above and press return to search.
కర్నాటకలో మద్యం రికార్డు వసూళ్లు..ఒక్కరోజే 50 కోట్ల లాభం!
By: Tupaki Desk | 5 May 2020 8:56 AM GMTకేంద్రం సడలింపులతో 45 రోజులుగా మూసి ఉన్న మద్యం దుకాణాలు ఒక్కసారిగా సోమవారం తెరవడంతో మందుబాబులు పండుగ చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత మద్యం తాగేందుకు తహతహలాడారు. దీంతో మద్యం దుకాణాలన్నీ ప్రజలతో కిటకిటలాడాయి. ఎప్పుడూ లేనంతగా మద్యం దుకాణాల ఎదుట ప్రజలు కిలో మీటర్ల మేర క్యూలో నిల్చుని మద్యం కొనుక్కొని వెళ్లారు. ఈ క్రమంలో చాలా రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరవడంతో భారీగా ఆదాయాలు పొందాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా భారీగా లాభాన్ని ఆర్జించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క బెంగళూరు పరిధిలో నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి దాదాపు 45 కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం.
బెంగళూరులో మద్యం దుకాణాల ముందు క్యూలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆడ, మగ తేడా లేకుండా ఈ సిలికాన్ సిటీలో మద్యం దుకాణాల ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఈ దుకాణాల ఎదుట అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మద్యం కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోనే పెద్దదైన టానిక్ లిక్కర్ స్టోర్ కూడా మందుబాబులతో సందడిగా మారింది.
మద్యం దుకాణాలు తెరవడంతో భారీగా కొనుగోళ్లు జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వారు కొన్ని రోజులకు సరిపడా మద్యం తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరగడంతో ఒక్కరోజే వందల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగిందని సమాచారం. పెద్ద సంఖ్యలో మద్యం కొనుగోలు చేశారు. దీంతో చాలా దుకాణాల్లో స్టాక్ మొత్తం అయిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్క బెంగళూరు నుంచే 45 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సమాచారం.