Begin typing your search above and press return to search.
జీఎస్టీ పడకుండా.. వాట్ యాన్ ఐడియా సర్ జీ!
By: Tupaki Desk | 27 July 2022 1:30 AM GMTకేంద్ర ప్రభుత్వం జూలై 18 నుంచి కొన్ని వస్తువులపై సర్వీస్ అండ్ గూడ్స్ ట్యాక్స్ (జీఎస్టీ)ని విధించిన సంగతి తెలిసిందే. పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, 25 కిలోలు అంతకంటే తక్కువ బరువున్న ప్యాకేజ్డ్ రైస్ బ్యాగులు తదితరాలపై జీఎస్టీని విధించింది. జూలై 18 నుంచి ఈ జీఎస్టీ రేట్లు అమల్లోకి కూడా వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ఫన్నీగా, వ్యంగ్యంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. పెరుగు ప్యాకెట్లపై పన్ను ఉండటంతో లూజ్ పెరుగును దోసిట్లో పట్టి తెచ్చుకోవడం ఇలా అనేక ఫన్నీ వీడియోలతో హల్చల్ చేశారు. ఈ కోవలో కర్ణాటక రైస్ మిల్లర్లు కూడా జీఎస్టీని తప్పించుకోవడానికి ఒక కొత్త ఐడియాను ఎంచుకున్నారు.
25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తిప్పికొట్టేందుకు కర్ణాటక రైస్ మిల్లు యజమానులు కొత్త టెక్నిక్ మొదలు పెట్టారు. వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
25 కేజీల వరకున్న రైస్ బ్యాగులపై 5శాతం జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా కర్నాటకలోని రైస్ మిల్లర్లు ఇక నుంచి 30 కేజీల చొప్పున బియ్యం బస్తాలు అమ్మాలని నిర్ణయించారు. 25 కేజీల వరకు జీఎస్టీ వల్ల ఒక్కో రైస్ బ్యాగ్ రూ.50-100 వరకు పెరుగుతుందని.. కస్టమర్లపై పన్ను భారం పడుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో 30 కిలోల రైస్ బ్యాగు వల్ల జీఎస్టీ వర్తించదని తెలిపారు. అందువల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని.. ఈ నేపథ్యంలో తాము 25 కిలోల రైస్ బ్యాగులకు బదులు 30 కిలోల రైసు బ్యాగులను అమ్మాలని నిర్ణయించామని చెబుతున్నారు. జీఎస్టీకి విరుగుడు మంత్రం ఇదే అని రైస్ మిల్లర్లు చెబుతుండటం విశేషం.
ఈ నేపథ్యంలో ఇక నుంచి 25 కిలోల బియ్యానికి బదులుగా 30 కిలోల రైస్ బ్యాగులను మార్కెట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందజేయడానికి సిద్ధమవుతున్నారు.
25 కిలోలు, అంతకంటే తక్కువ ఉన్న బ్యాగుపైన 5 శాతం జీఎస్టీ వేయాలని కేంద్రం నిర్ణయించడంతో.. 26 కిలోల సంచుల్లో లేదా 30 కిలోల సంచుల్లో బియ్యం ప్యాక్ చేసి విక్రయించాలని రైస్ మిల్లర్లు యోచిస్తున్నారు.