Begin typing your search above and press return to search.

బ‌డిలో బాబ్రీ కూల్చివేత స్కిట్‌..సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌రచ్చ‌

By:  Tupaki Desk   |   16 Dec 2019 5:33 PM GMT
బ‌డిలో బాబ్రీ కూల్చివేత స్కిట్‌..సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌రచ్చ‌
X
అయోధ్య లోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రదేశంలో రామమందిర నిర్మాణానికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు గత నెల 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సున్నిత‌మైన ఈ వివాదం - తీర్పు విష‌యంలో అంతా సంయ‌మ‌నం పాటిస్తున్న త‌రుణంలో...ఓ పాఠ‌శాల‌లో విద్యార్థుల నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని కల్కడలోని ఓ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాబ్రీ మసీదు కూల్చివేత స్కిట్ ను ప్రదర్శించారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కల్కడలో ఉన్న శ్రీరామ విద్యాకేంద్ర ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా - బాబ్రీ స్కిట్ ప్ర‌ద‌ర్శించారు. మసీదు గుమ్మటానికి సంబంధించిన ఓ భారీ ఫ్లెక్సీని వేదిక మధ్యలో ఉంచి తెల్ల చొక్కాలు - కాషాయ రంగు ప్యాంట్లను ధరించి జై శ్రీరామ్ - జై వీర హనుమాన్.. అంటూ నినాదాలు చేస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత స్కిట్ ను ప్రదర్శించారు. బాబ్రీ మ‌సీదు ఉన్న ఫ్లెక్సీనీ చింపేయడంతో ఈ స్కిట్ ముగుస్తుంది.

అయితే, ఈ నాట‌క‌మే వివాదాస్ప‌దం అంటే....ఈ స‌మ‌యంలోనే సంద‌ర్భాలు - పాఠ‌శాల నేప‌థ్యంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వార్షికోత్స‌వానికి బీజేపీ నేత‌ - కేంద్రమంత్రి సదానంద గౌడ - పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ముఖ్య అతిథులుగా విచ్చేయ‌డం..వారి సమ‌క్షంలోనే ఈ వివాదాస్ప‌దం అంశం ప్ర‌ద‌ర్శితం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రోవైపు కల్కడ్క ప్రభాకర్ భట్ అనే పేరు మీద ఏర్పాటైన ఓ ట్రస్ట్ ఈ పాఠ‌శాల‌ను నిర్వ‌హిస్తోంది. ఆర్ ఎస్ ఎస్ కర్ణాటక శాఖ ద్వారా ఈ పాఠ‌శాల‌కు నిధులు అందుతున్నాయని - అందుకే ఇలా రెచ్చ‌గొట్టే ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ని ...ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.