Begin typing your search above and press return to search.
కర్నాటక సెక్స్ స్కాండల్: సంచలనం రేపుతున్న కొత్త వీడియో..!
By: Tupaki Desk | 15 March 2021 9:30 AM GMTకర్నాటక రాష్ట్ర జలవనరుల మాజీ మంత్రి రమేష్ జార్కి సెక్స్ వీడియోల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. డైలీ సీరియల్ ను తలపిస్తోంది. పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న ఈ వ్యవహారంలో రోజుకో నేత చర్చలోకి వస్తున్నారు.
ఈ సెక్స్ వీడియో సీడీ వ్యవహారం వెనుక కేపీసీసీ అధ్యక్షుడు డి.కే. శివకుమార్ ఉన్నట్టు కొందరు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి మరోసారి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివకుమార్ పేరును కొందరు ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాగా.. తనకు ప్రాణభయం ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతూ సెక్స్ వీడియోలో ఉన్న యువతి తాజాగా.. మరో వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా కుమారస్వామి మాట్లాడుతూ.. ఆమెకు రక్షణ కల్పించాలని అన్నారు.
మరోవైపు.. కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ సీడీ వెనక ఎవరున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ కూడా ఈ వీడియో గురించి మాట్లాడారని, దీన్ని బట్టి బీజేపీ నేతలే ఈ వీడియో కుట్ర వెనక ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. కొందరు బీజేపీ నాయకులు తనను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని, దీనిపై తగిన సమయంలో స్పందిస్తానన్నారు శివకుమార్.
కాంగ్రెస్ నేత సిద్ధారామయ్య కూడా ఈ విషయమై మాట్లాడారు. తనకు భద్రత కోరుతూ యువతి వీడియో విడుదల చేయడంపై అసెంబ్లీలో చర్చిస్తానని చెప్పారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని చెప్పిన ఆయన.. ఈ సీడీ వెనుక ఎవరున్నారని భావిస్తున్నారన్న ప్రశ్నపై స్పందించడానికి నిరాకరించారు. కాగా.. సీడీ విషయం బయటకు వచ్చిన దగ్గర్నుంచి అందులో ఉన్న మహిళ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.