Begin typing your search above and press return to search.
భారీ వర్షాలు.. ఆ రాష్ట్రం హ్యాపీ!
By: Tupaki Desk | 15 Aug 2019 7:56 AM GMTకర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రముఖ జలాశయాలు భర్తీ అయ్యాయి. ఈనేపథ్యంలో ఇక నుంచి విద్యుత్ కొరత ఉండదని చెప్పవచ్చు. అంతేకాకుండా తాగునీటి సమస్య కూడా తీరిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. కర్ణాటకలో వెలుగులు నింపే శివమొగ్గ జిల్లా లింగనమక్కి జలాశయం వర్షాకాలం అవధికి ముందే భర్తీ కావడంతో విద్యుత్ సమస్య కు చెక్ పెట్టినట్లైంది. అదేవిధంగా ప్రముఖ జలాశయాలు కేఆర్ ఎస్ - తుంగభద్రా - భద్రా - ఆలమట్టి - ఘటప్రభా - మలప్రభా - కబిని - హారంగి - హేమావతి - సూపా తో పాటు పలు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ నేపద్యంలో వేసవిలో తలెత్తే తాగునీటి సమస్య - విద్యుత్ సమస్యకు ఉపశమనం కలిగినట్లయింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. కావేరి జలాశయం తీరప్రాంతాల్లో గత పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తమిళనాడు మెట్టూరు జలాశయానికి అధికస్దాయిలో నీరు వెళ్తుంది. అలాగే పదే పదే కావేరి నది నీటి వివాధాన్ని ముందు పెట్టుకుని కేంద్రం ద్వారా కర్ణాటకపై ఒత్తిడి తేవడానికి యత్నిస్తున్న తమిళనాడు గొడవకు విరామం పడినట్లే. రెండువారాల క్రితం రాష్ట్రంలోని ప్రముఖ జలాశయాల్లో నీరు లేని కారణంగా తాగునీరు - విద్యుత్ సరఫరా ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది.
ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధికార బాధ్యతలు చేపట్టిన అనంతరం జల్లా కలెక్టర్లు - ప్రాదేశిక కమిషనర్లు - సీఈఓలతో పాటు సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీరు - పశువుల పశుగ్రాసం - రైతులకు సమర్థంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాలనుంచి రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో చెరువులు - ఆనకట్టలు - రాష్ట్రంలోని ప్రముఖ జలాశయాలు నిండిపోయాయి.
రాష్ట్రంలో సగానికి పైగా విద్యుత్ సరపరా అందించే శివమొగ్గ జిల్లా సాగర తాలూకా లింగనమక్కిలో ఉన్న శరావతి జలాశయం ఈ సారి అవధికి ముందే నిండిపోయింది. 1,819 అడుగుల సామర్ద్యం కలిగిన ఆనకట్టలో 1,812 అడుగుల నీరు సేకరిస్తుంది. కేవలం ఏడు అడుగులు మాత్రమే బాకీ ఉండగా ఇన్ ఫ్లో అధికంగా ఉన్న కారణంగా ఒకట్రెండు రోజుల్లో భర్తీ అయ్యే అవకాశం ఉంది. లింగనమక్కి జలాశయం నిండిన కారణంగా విద్యుత్ ఉత్పాదన కు ఎలాంటి సమస్య లేకుండా పోయింది. తాగునీటి కి ప్రముఖ జలాశయాలైన కేఆర్ ఎస్ - కబిని - హరింగి - హేమావతి - అలమట్టి - బసవసాగర - ఘటప్రభా - మలప్రభాతో పాటు చాలా జలాశయాలు అవధికి ముందే నిండిపోవడంతో వేసవిలో నీటి సమస్య ఉండకపోవచ్చు.