Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌కు ప‌ద్మ‌శ్రీ క‌ర్ణాట‌క పుణ్య‌మా?

By:  Tupaki Desk   |   26 Jan 2016 9:49 AM GMT
జ‌క్క‌న్న‌కు ప‌ద్మ‌శ్రీ క‌ర్ణాట‌క పుణ్య‌మా?
X
తెలుగు సినిమాకు త‌న సినిమాతో అంత‌ర్జాతీయంగా పేరు ప్ర‌ఖ్యాతుల్ని తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. తెలుగువారంతా గ‌ర్వించేలా సినిమాలు తీసే ఆయ‌న‌.. తాజాగా తాను తీసిన బాహుబ‌లితో తెలుగు సినిమా రేంజ్ ను పూర్తిగా మార్చేశారు. అలాంటి రాజ‌మౌళికి తాజాగా ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల్లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించ‌టంప‌ట్ల ప‌లువురు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

జ‌క్క‌న్న‌కు ప‌ద్మ‌శ్రీ రావ‌టంపై ప‌లువురు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలోనే.. జ‌క్క‌న‌కు వ‌చ్చిన ప‌ద్మ‌శ్రీ తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల పుణ్యం కాద‌ని.. క‌ర్ణాట‌క రాష్ట్రం కార‌ణంగా ఆ పుర‌స్కారం ల‌భించింద‌న్న మాట ప‌లువురికి విస్మ‌యంగా మారింది. రాజ‌మౌళికి ప్ర‌క‌టించిన ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం వార్త‌లో బ్రాకెట్ లో క‌ర్ణాట‌క అని ఉండ‌టం ప‌లువురికి అర్థం కాలేదు. ఈ విష‌యంపై కాస్త లోతుల్లోకి వెళితే.. రాజ‌మౌళికి వ‌చ్చిన ప‌ద్మ‌శ్రీ అవార్డు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సిఫార్సు చేస్తే వ‌చ్చింది. రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడికి పుర‌స్కారం ల‌భించే విష‌యాన్ని తెలుగు ప్ర‌భుత్వాలు మ‌రిస్తే.. ప‌క్క‌నున్న క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప‌ట్టించుకొని ఇప్పించ‌టంపై తెలుగు సినీ అభిమానులు అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గ‌త ఏడాది త‌న‌ను ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు చెప్పార‌ని.. కానీ గ‌త ఏడాది అవార్డురాలేద‌ని జ‌క్క‌న్న వెల్ల‌డించాడు. ఈ ఏడాది పద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించ‌టం ప‌ట్ల కాస్త ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన రాజ‌మౌళి తాను పుట్టింది క‌ర్ణాట‌క‌లో అని.. చ‌దువుకుంది ఏపీలో అయితే.. ప‌ని చేసింది త‌మిళ‌నాడులో అని.. స్థిర‌ప‌డింది తెలంగాణ‌లో అంటూ త‌న‌కు నాలుగు రాష్ట్రాల‌తో ఉన్న సంబంధాన్ని పేర్కొన్నారు.ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు రాజ‌మౌళిని మ‌ర్చిపోవ‌టం స‌రికాద‌న్న భావ‌న సినీ ప్రియులు వ్య‌క్తం చేస్తున్నారు.