Begin typing your search above and press return to search.
అమెజాన్ దుమారం: లోదుస్తులపై కర్ణాటక చిహ్నం
By: Tupaki Desk | 6 Jun 2021 1:30 PM GMTకార్పొరేట్ విదేశీ కంపెనీలన్నీ ఇప్పుడు కన్నడ భాషపై పడ్డాయి. ఇప్పటికే ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ‘కన్నడ భాష’ను అవమానించడం పెద్ద దుమారం చెలరేగింది. కన్నడిగుల ఆగ్రహానికి గూగుల్ దిగివచ్చింది. వెంటనే క్షమాఫన కోరడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
తాజాగా ఆ వివాదం మరిచిపోకముందే లోదుస్తులపై కన్నడ రాష్ట్ర చిహ్నం, పతాకం రంగులు ముద్రించి అమెజాన్ లో విక్రయానికి ఉంచడం పెద్ద దుమారం రేపింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పై కన్నడ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కన్నడిగులు ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉన్న ఈ సంస్థ తీరుపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. కర్ణాటక ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయ్యింది.
కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు టీఎస్ నాగాభరణం శనివారం స్పందిస్తూ కన్నడిగుల ఆత్మాభిమానం దెబ్బతీస్తూ ఘెరంగా అవమానించేలా వ్యవహరిస్తున్న అమెజాన్ తీరును ఎండగట్టారు.
ఇక కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద లింబావళి కూడా అమెజాన్ సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్, అమెజాన్ సంస్థలు కన్నడిగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.