Begin typing your search above and press return to search.
పెరుగుతున్న కేసులతో.. ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పేట్లు లేదట
By: Tupaki Desk | 14 March 2021 6:30 AM GMTసెకండ్ వేవ్ దిశగా దేశం అడుగులు వేస్తోంది. గడిచిన వారంలో కరోనా కొత్త కేసుల నమోదు భారీగా పెరిగిపోవటం ఒక ఎత్తు అయితే.. ఈ కేసుల్లో అత్యధికం ఆరు రాష్ట్రాలకే పరిమితం కావటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో సింహభాగం ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. అదే రీతిలో ఐటీ పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
దాదాపు 48రోజుల తర్వాత కర్ణాటకలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువైంది. మొన్నటివరకు ఐదువేల.. అంతకంటే తక్కువగా ఉన్న కేసులు ఇప్పుడు ఎనిమిది వేలకు చేరుకున్నాయి. ఈ జనవరి 23న గరిష్ఠంగా రోజులో 902 కేసులు నమోదైతే.. గత శుక్రవారం 833 కేసులు నమోదు కావటం గమనార్హం. తాజాగా నమోదవుతున్న కేసుల్లో సౌతాఫ్రికా స్టెయిన్ కేసులు ఎక్కువ కావటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9.6లక్షల మంది కరోనా బాధితులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. లాక్ డౌన్ దిశగా కర్ణాటక అడుగులు వేయక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నింటికి మించిన బెంగళూరులో లాక్ డౌన్ విధింపు మరోసారి తప్పదన్నట్లుగా చెబుతున్నారు. పాజిటివ్ కేసుల కన్నా.. డిశ్చార్జిలు తగ్గటం మహమ్మారి మరింతగా చెలరేగిపోతుందనటానికి కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టటానికి లాక్ డౌన్ ఒక చక్కటి మార్గంగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన కీలక నిర్ణయం రానున్న రోజుల్లో నమోదయ్యే కేసుల మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.