Begin typing your search above and press return to search.
ప్రియుడి కోసం భర్తను చంపేసింది.. ఏఎస్ ఐతో రిలేషన్
By: Tupaki Desk | 16 Jan 2020 5:25 AM GMTబంధాలు ఏమైపోతున్నాయ్? మనుషులు ఇలా తయారవుతున్నారేంటి? ఎవరిని నమ్మాలి? అన్న క్వశ్చన్లు మాత్రమే కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటోళ్లను నమ్మలేం.. ఇంట్లో వారిని కూడా నమ్మలేని దరిద్రపు గొట్టు పరిస్థితుల్లోకి వెళుతున్నామా? అన్న సందేహం కలిగేలా చేస్తున్న పరిస్థితి.
విన్నంతనే విస్మయానికి గురి కావటమే కాదు.. సినిమాల్లోనూ.. టీవీ సీరియల్స్ లోనూ ఇలాంటి యాంగిల్ కనిపించదని చెప్పే ఈ రియల్ క్రైంలోకి వెళితే.. కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలోని చామరాజ నగర జిల్లాలోని కొళ్లేగాల తాలూకాలోని పూజారి బావిదొడ్డి గ్రామం ఒకటుంది.టిప్పర్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్న రంగస్వామికి రూపా అనే యువతితో పెల్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
రంగస్వామితో కలిసి టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్న మద్దెగౌడ అనే వ్యక్తితో రూపకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన రంగస్వామి భార్యను మందలించాడు. దీంతో రగిలిపోయిన రూప అతన్ని వదిలించుకోవటం కోసం భర్తను హత్య చేసింది. రాత్రివేళ నిద్రపోతున్న భర్త తల మీద కర్రతో బలంగా కొట్టి చంపేసిన ఆమె.. అనంతరం డెడ్ బాడీని చెరువు దగ్గర గుంతలో పడేసి.. మట్టి కప్పేసింది.
ఏమీ తెలీనిదానిలా తన భర్త కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు మూడేళ్లు గడిచినా ఈ కేసు ముందుకు వెళ్లలేదు. రంగస్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా రూప తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే.. మొత్తం విషయాన్ని చెప్పి షాకిచ్చింది.
ఈ కేసులో మరో కీలకమైన ట్విస్ట్ ఏమంటే.. మూడేళ్లు కేసు పురోగతి లేకుండా పోవటానికి కారణం ఒక ఏఎస్ ఐగా గుర్తించారు. తన కేసు ముందుకు వెళ్లకుండా ఉండేలా చేయటం కోసం సదరు ఏఎస్ ఐతోనూ రూప వివాహేతర సంబంధాన్ని పెట్టుకొంది. తాజాగా బయటకు వచ్చిన వివరాలతో సదరు అధికారిపై చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. తనను ఏఎస్ ఐ వాడుకున్నట్లుగా రూప ఆరోపిస్తోంది. భర్తను లేపేయటమే ఒక దారుణమైన ఆలోచన అనుకుంటే.. కేసు ముందుకెళ్లకుండా ఉండేందుకు ఏఎస్ ఐతో రిలేషన్ పెట్టుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.