Begin typing your search above and press return to search.
ఆ నలుగురు రాకపోవడంతో తోపుడుబండిపై తీసుకెళ్లిన భార్య
By: Tupaki Desk | 19 July 2020 6:30 AM GMTమానవ సంబంధాలపై మహమ్మారి వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. మహమ్మారి మానవత్వాన్ని అనే దానిని చంపేస్తోంది. ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరిగినా పలకరించి.. వారికి సపర్యలు చేయడం లేదు. ఈ విపత్కర సమయంలో కర్నాటకలో ఓ అమానవీయ సంఘటన జరిగింది. చస్తే పాడే మోయడానికి ఆ నలుగురు కూడా రాని పరిస్థితి. దీంతో తన భర్త మృతదేహాన్ని తోపుడుబండిపై తీసుకెళ్లింది. ఆమె ఒక్కతే అతడి అంత్యక్రియలు నిర్వహించడం ఎంతటి దుస్థితి వచ్చిందో అర్థమవుతోంది. మహిళ..
కర్ణాటకలోని బెలగావి జిల్లా అథానిలో సదాశివ (55) గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.. అయితే మూడు రోజుల కిందట ఓ ఫంక్షన్ కోసం భార్య కొడుకు.. కుమార్తె వెళ్లారు. భర్త సదాశివం ఇంట్లో ఉంచి వారు వెళ్లారు. వాళ్లు ఫంక్షన్ నుంచి తిరిగి ఇంటికి రాగా ఆయన ఎంతకీ తలుపు తీయలేదు. కంగారు పడిన వారు చివరకు తలుపుబద్ధలు కొట్టి లోపల చూస్తే సదాశివం కూర్చున కుర్చీలో అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవాళ్లు వైరస్ తో మరణించాడని అనుమానించారు. దీంతో ఎవరూ ఆ ఇంటికి వెళ్లలేదు.
అతడి అంత్యక్రియల కోసం గురువారం ఏర్పాట్లు చేయగా ఎవరూ రాలేదు. తన భర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని చాలా మందిని ఆ మహిళ ప్రాదేయపడ్డా ఎవరూ కనికరించలేదు. వైరస్ తో కాదు సహజంగా తన భర్త మరణించాడని చెప్పినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.
దీంతో విసుగు చెందిన ఆమెచేసేది కొడుకు సహాయంతో తోపుడు బండిపై భర్త మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లింది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి సాయంగా తోపుడు బండి నడిపించాడు. దహన సంస్కారాలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నాడు. తన భర్తకు ఇలాంటి అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.