Begin typing your search above and press return to search.

ఇప్పుడు కొత్త గుడి.. మసీదు.. చర్చి అవసరం లేదంటూ కార్తీ సంచలనం

By:  Tupaki Desk   |   10 Nov 2019 6:07 AM GMT
ఇప్పుడు కొత్త గుడి.. మసీదు.. చర్చి అవసరం లేదంటూ కార్తీ సంచలనం
X
అందరూ నడిచే బాట లో నడవనని చెప్పే ధోరణి కొందరిలో కనిపిస్తుంది. కానీ.. ఏ విషయంలో ఎలా వ్యవహరించాలన్న విచక్షణ చాలా ముఖ్యం. మిగిలిన వారికి ఉన్నా లేకున్నా రాజకీయ నేతల కు చాలా అవసరం. అయితే.. ఈ విషయాన్ని కార్తీ చిదంబరం మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి సాగుతున్న అయోధ్య వివాదానికి పుల్ స్టాప్ పెడుతూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన వేళ.. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అయోధ్య తీర్పును రాజకీయ పక్షాలు.. పలువురునేతలు.. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖుల తో పాటు.. మేధావులు స్వాగతిస్తున్న వేళ అందుకు భిన్నంగా కార్తీ చిదంబరం వ్యాఖ్యలు భిన్నంగా ఉండటంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశంలో పూజలు.. ప్రార్థనలు నిర్వహించేందుకు చాలా మందిరాలు ఉన్నాయని.. ఇలాంటి వేళ కొత్త ఆలయాలు.. మసీదులు.. చర్చిలు అవసరం లేదని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు.

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడైన కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసు లో నిందితుడన్న విషయాన్ని మర్చి పోకూడదు. ఆ మధ్యన ఈ కేసులో అరెస్ట్ అయిన కార్తీ ఈ మధ్య నే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయోధ్య పై సుప్రీం తీర్పు చారిత్రాత్మకంగా పలువురు అభివర్ణిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా కార్తీ చిదంబరం కొత్త వాదనకు తెర తీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.