Begin typing your search above and press return to search.

పవన్ తో తలపడతా... వైసీపీ మంత్రి బోల్డ్ స్టేట్మెంట్

By:  Tupaki Desk   |   21 Jan 2023 2:03 PM GMT
పవన్ తో తలపడతా... వైసీపీ మంత్రి బోల్డ్ స్టేట్మెంట్
X
వైసీపీ పవన్ కళ్యాణ్ మీద గురి పెట్టింది. నిజానికి ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే ఇపుడు ఆ పార్టీతో పొత్తు జట్టు పెట్టుకుని ముందుకు వస్తున్న జనసేన మీద వైసీపీ అగ్రెస్సివ్ మూడ్ లో అటాక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటిగా రావాలనుకోవడం వైసీపీకి నచ్చడంలేదు అంటున్నారు. దాంతో పాటు గత ఎన్నికల కంటే ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అలెర్ట్ అవుతోంది.

జనసేనను ఎక్కడికక్కడ కౌంటర్ చేయడంతో పాటు పవన్ కే డైరెక్ట్ అటాక్ ఇస్తూ వైసీపీ నేతలు మంత్రులు మీడియా ముందుకు వస్తున్నారు. ఇక జనసేన తెలుగుదేశం పొత్తు గోదావరి జిల్లాలలో బాగా పండుతుంది ఒక కచ్చితమైన అంచనా ఉంది. 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లకు గాను ఆరు తెలుగుదేశం గెలిస్తే పశ్చిమ గోదావరి జిల్లా రాజోలులో జనసేన గెలిచింది. మిగిలిన 27 సీట్లూ వైసీపీ గెలుచుకుంది.

అయితే ఇపుడు పరిస్థితులు మొత్తం మారుతున్నాయి. జనసేన తెలుగుదేశం కలిస్తే మాత్రం 34 సీట్లలో రాజకీయం పూర్తిగా మారుతుంది అని అంటున్నారు. దాంతో అలెర్ట్ అవుతున్న వైసీపీ జనసేనను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. జనసేనకు ఏమీ లేదని చెప్పాలనుకుంటోంది. జనసేన తెలుగుదేశం కలిసినా మరోమారు వైసీపీ గెలిచి తీరుతుందని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు.

పైగా ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలే తమకు శ్రీరామ రక్ష అని ఆయన చెబుతున్నారు. తమకు అవే అతి పెద్ద ఓటు బ్యాంక్ అని కూదా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధినాయకత్వం ఆదేశిస్తే పవన్ మీద తాను పోటీ చేస్తాను అని కారుమూరి అంటున్నారు. అదే సమయంలో పవన్ తణుకులో వచ్చే ఎన్నికల్లో తనతో పోటీ చేయాలని ఆయన సవాల్ చేస్తున్నారు.

నిజానికి తణుకులో కారుమూరి 2019లో జగన్ వేవ్ లో కూడా ఏమంతా గొప్ప మెజారిటీతో గెలవలేదు. 20019 ఎన్నికల్లో కారుమూరికి తణుకు లో 75,975 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి రాధాక్రిష్ణకు 73,780 ఓట్లు వచ్చాయి.అంటే కేవలం రెండు వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు అన్న మాట. ఇక తణుకు నుంచి జనసేన తరఫున పోటీ చేసిన పసుపులేటి వెంకట రామారావుకు 31,961 ఓట్లు పోలయ్యాయి. మరి రేపటి రోజున పొత్తులతో ఈ ఓట్లు రెండు పార్టీలకు చేరితే భారీ తేడాతో కారుమూరి ఓడిపోవాల్సి ఉంటుంది.

అయితే రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు అన్న లెక్కలు పనిచేయవు కాబట్టి అనేక ఇతర ఫ్యాక్టర్లు కూడా వర్కౌట్ అవుతాయి కాబట్టి తన విజయం తణుకులో మరోసారి తధ్యమని కారుమూరి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే కారుమూరి 2009, 2019లో రెండు సార్లు గెలిచారు. అదే 2014లో ఆయన ఓడారు అంటే తెలుగుదేశం జనసేన పొత్తుల ప్రభావమే అంటున్నారు.

మరి 2014 ఫలితాలు 2024లో రిపీట్ కావని కారుమూరి భావిస్తున్నారా అన్నది చూడాలి. మరో వైపు చూస్తే పవన్ పోటీ చేసే ప్లేసెస్ అని వస్తున్న వార్తలలో ఇప్పటిదాకా తణుకు ఎక్కడా లేదు. మరి కోరి మరీ కారుమూరి తనతో పోటీ అంటున్నారు అంటే నిజంగా పవన్ పోటీకి దిగితే మంత్రి గారి పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా ఉంది. చూడాలి ఏ ధైర్యంతో కారుమూరి బోల్డ్ గా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.