Begin typing your search above and press return to search.
ఆ భారత క్రికెటర్ కు కరోనా
By: Tupaki Desk | 13 Aug 2020 11:10 AM GMTటీమిండియా క్రికెటర్, కర్ణాటక బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారినపడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. కరుణ్ నాయర్ నాలుగు వారాల క్రితమే కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం కోలుకున్నట్టు సమాచారం.
ఆగస్టు 8న నిర్వహించిన పరీక్షల్లో కరుణ్ కు నెగెటివ్ గా వచ్చింది సమాచారం. టీమిండియాకు ఆడుతున్న క్రికెటర్ కు కరోనా సోకడం ఇదే తొలిసారి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం వేళ ఈ వార్త క్రికెటర్లను కలవరపెడుతోంది. ప్రస్తుతం కరుణ్ నాయర్ కింగ్స్ లెవన్ పంజాబ్ తరుఫున ఆడుతున్నాడు.
యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ మ్యాచులు జరుగనున్నాయి. ఆగస్టు 20 తర్వాత అన్ని ప్రాంఛైజీలు యూఏఈకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
టోర్నీ ప్రారంభానికి ముందే క్రికెటర్లకు వైరస్ పరీక్షలు నిర్వహించాలని టీమ్ ప్రాంచైజీలకు బీసీసీఐ సూచించింది. ఇక కరుణ్ నాయర్ 2020 సీజన్ కు కింగ్స్ లెవల్ తరుఫున ఆడేందుకు ఫిట్ గా ఉన్నట్టు తెలిసింది. కర్ణాటక జట్టుకు ఆడుతున్న కరుణ్ నాయర్ ప్రస్తుతం టెస్టుల్లో ఇండియన్ టీంకు ఆడుతున్నాడు.