Begin typing your search above and press return to search.
వీల్ ఛైర్ నుంచి సీఎం ఛైర్ పై కన్ను
By: Tupaki Desk | 7 March 2016 7:26 AM GMT దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు నమోదు కాబోతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం పడుతున్న అత్యంత వృద్ధ నేతగా కరుణానిధి రికార్డు సృష్టించబోతున్నారు. అంతేకాదు.... వీల్ ఛైర్ నుంచి ముఖ్య మంత్రి పీఠం కోసం పోటీపడుతున్న నేత కూడా ఆయనే. దేశంలోనే సీఎం పీఠం కోసం పోటీకి దిగుతున్న వృద్ధ రాజకీయ నేతగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత కరుణానిధి పేరిట ఈ రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం 92 ఏళ్లు నిండిన కరుణానిధి త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఐదేళ్ల క్రితం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే చేతిలో ఘోర పరాజయం చవిచూపిన నేపధ్యంలో కరుణానిధి సీఎం పీఠాన్ని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఇక ప్రత్యక్ష ఎన్నికలకు తన వారుసుడిగా స్టాలిన్ ను రంగంలోకి దించుతున్నట్లు ఆయన ఒకానొక సందర్భంలో ప్రకటించారు. అయితే అందుకు భిన్నంగా ఈ దఫా ఎన్నికల్లో కూడా తానే బరిలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నారు.
కాగా చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితమైన ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రత్యేకంగా ప్రచార రధాన్ని తయారుచేయించుకున్నారు. ఆ ప్రచార రథంలో వీల్ చైర్ లోనే కరుణానిధి ప్రచార రధంలో సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఏర్పాట్లు ఉంటాయి. దాంతో పాటు వైఫై - హోమ్ ధియేటర్ - స్పాట్ లైట్స్ - స్పీకర్లు - మైక్రోఫోన్ - యాంప్లిఫ్లయర్లు వంటి సౌకర్యాలుంటాయి. మొత్తానికి ఇలా లేటు వయసులో ఘాటు స్టైల్లో ప్రచారానికి దిగుతున్న కరుణ సీఎం పీఠం కూడా దక్కించుకుని రికార్డు సృష్టిస్తారో లేదంటే పోటీ పడడంలో రికార్డులు నెలకొల్పడంతోనే సరిపెడతారో చూడాలి.