Begin typing your search above and press return to search.

కరుణానిధి 14 ఏళ్ల కుర్చీ కథ..

By:  Tupaki Desk   |   9 Aug 2018 6:19 AM GMT
కరుణానిధి 14 ఏళ్ల కుర్చీ కథ..
X
డీఎంకే అధినేత కరుణానిధిని చూడగానే మొదట రెండు గుర్తుకొస్తాయి. ఒకటి ఆయన కళ్లకు పెట్టుకునే నల్ల కల్లజోడు.. రెండోది ఆయన కూర్చునే చక్రాల కుర్రీ.. ఇప్పుడు ఆయన మరణించి మెరీనా బీచ్ లోని సమాధిలో సేద తీరుతున్నాడు. ఆ కళ్ల జోడు ఆయనతోపాటే సమాధి అయ్యింది. కానీ ఆయన కూర్చున్న కుర్చీ మాత్రం ఇంకా ఆయన లేడంటూ మౌనసాక్షిగా కరుణానిధి ఇంట్లో ఓ మూలన రోధిస్తోంది.ఆ చక్రాల కుర్రీ వెనుక ఆసక్తికర కథ ఉంది.

కరుణానిధికి వయసు పెరిగిపోవడం.. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువ బిజీ కావడంతో వెనునొప్పి ఓసారి తీవ్రంగా వచ్చింది. కానీ పనుల ఒత్తిడితో ఆయన దాన్ని నిర్లక్ష్యం చేశాడు. 2008 డిసెంబర్ నుంచి కరుణానిధికి వెన్నునొప్పి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అయితే ఆస్పత్రికి వెళితే అడ్మిట్ చేస్తారని.. ఆపరేషన్ అంటారని భయపడి ఎవరికీ చెప్పలేదు. దానిని భరిస్తూనే వచ్చాడు. బాధ ఎక్కువ కావడంతో కుటుంబ వైద్యుడు గోపాల్ కు విషయం చెప్పాడు. ఆయన ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ మయిల్ వాగనన్ ను ఇంటికి రప్పించాడు.

అప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్ మయిల్ సూచనల మేరకు రామచంద్ర ఆస్పత్రి వైద్య నిపుణుడు డాక్టర్ మార్తాండాన్ని రాత్రి ఒంటిగంటకు ఇంటికి రప్పించారు. మార్తాండం కరుణకు చికిత్స చేశారు. ఆస్పత్రిలో చేరాలని సూచించారు.ఆ సూచన మేరకు రాత్రి 2 గంటలకు రామచంద్ర ఆస్పత్రిలో చేర్చారు. వయోభారంతోపాటు శరీర బరువు కారణంగా వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడిందని వైద్యులు గుర్తించారు. మందులు, ఇంజక్షన్లతో చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కరుణానిధి వెన్నుముఖకు శస్త్రచికిత్స చేసి నొప్పి తగ్గించారు. అయితే ఆయనను నడిచేలా చేద్దామన్న చికిత్స ఫలితం రాలేదు. దీంతో కరుణానిధి శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు.

ఇప్పుడు కరుణానిధి భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆయన వాడిన కుర్చీ మాత్రం ఆయన జ్ఞాపకాలను ఇంటిసభ్యులకు , కార్యకర్తలకు గుర్తు చేస్తోంది.