Begin typing your search above and press return to search.

క‌రుణ ఆరోగ్యం తాజాగా ఇలా ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   31 July 2018 4:57 AM GMT
క‌రుణ ఆరోగ్యం తాజాగా ఇలా ఉంద‌ట‌!
X
రెండు.. మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా తీవ్ర ఆవేద‌న‌లో ఉన్న డీఎంకే కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల‌కు కాస్త ఊర‌ట‌నిచ్చేలా అధినేత ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. తీవ్ర జ్వ‌రం.. మూత్ర పిండాల ఇన్ఫెక్ష‌న్ తో ఆసుప‌త్రిలో చేరిన క‌రుణానిధి ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా క‌రుణ కుటుంబ స‌భ్యులంతా ఆసుప‌త్రికి ప‌రుగులు తీయ‌టం.. వారి ముఖాలు ఆవేద‌న‌తో నిండిపోవ‌టంతో.. క‌రుణ ఆరోగ్యంపై ప‌లు సంశ‌యాలు వ్య‌క్త‌మ‌య్యాయి. త‌మ అభిమాన అధినేత ఆరోగ్యం విష‌మిస్తున్న‌ట్లుగా వార్త‌లు రావ‌టంతో.. వేలాది మంది ఆయ‌న‌కు చికిత్స చేస్తున్న కావేరీ ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకోవ‌టం.. త‌మ అభిమాన నేత‌ను చూసేందుకు అవ‌కాశం ఇవ్వాలంటూ నినాదాలు చేయ‌సాగారు.

దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌ట‌మే కాదు.. భావోద్వేగాలు పెరిగిపోవ‌టంతో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు స‌మ‌స్య‌గా మారుతుంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఒక‌ద‌శ‌లో డీఎంకే అభిమానులు.. కార్య‌క‌ర్త‌ల్ని నిలువ‌రించేందుకు పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్పాల్సి వ‌చ్చింది.

క‌రుణ ఆరోగ్య ప‌రిస్థితుల నేప‌థ్యంలో జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకొని చెన్నై చేరుకున్నారు. క‌రుణ‌కు వైద్యం చేస్తున్న ఆసుప‌త్రి వ‌ద్ద‌కు వెళ్లాల‌ని భావించినా.. డీఎంకే కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఉండ‌టంతో లేనిపోని స‌మ‌స్య‌ల‌కు తెర తీసిన‌ట్లు అవుతుంద‌న్న ఉద్దేశంతో ఆయ‌న త‌న ప‌రామ‌ర్శ‌ను వాయిదా వేసుకున్నారు.

మ‌రోవైపు.. ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీరుసెల్వంతో కూడిన ఆరుగురు మంత్రుల‌తో క‌లిసి ఆసుప‌త్రికి వెళ్లిన ఆయ‌న‌.. క‌రుణ‌ను.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌లిశారు. క‌రుణ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. క‌రుణ కుమారుడు స్టాలిన్ తో పాటు కుమార్తె క‌నిమొళితో పాటు ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తోనూ ప‌న్నీర్ సెల్వం మాట్లాడారు. ఐసీయూకి వెళ్లి క‌రుణ‌ను చూశారు.

క‌రుణ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని.. ఆయ‌న చికిత్స‌కు స్పందిస్తున్న‌ట్లుగా వైద్యులు చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. క‌రుణ‌ను ప‌రామ‌ర్శించిన ఎండీఎంకే నేత వైగో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆదివారం రాత్రి విష‌మ ప‌రిస్థితి నుంచి క‌రుణ బ‌య‌ట‌ప‌డ్డార‌ని.. ఇదో వైద్య అద్భుతంగా ఆయ‌న అభివ‌ర్ణించ‌టం చూస్తే.. క‌రుణ కోలుకున్న‌ట్లేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.