Begin typing your search above and press return to search.
కరుణ అనారోగ్యం ఎంత సీరియస్ గా ఉందంటే..
By: Tupaki Desk | 17 Dec 2016 4:48 AM GMTఒక రాష్ట్రంలో రెండు పెద్ద తలకాయలు ఇంచుమించు ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురి కావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడులో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొని ఉంది. 75 రోజుల పాటు ఆసుపత్రిలో అనారోగ్యంతో పోరాటం చేసిన అన్నాడీఎంకే అధినేత్రి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓడిపోయి.. శాశ్విత నిద్రలోకి జారిపోయి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటం తెలిసిందే. అమ్మ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వేళలోనే.. తమిళనాడు విపక్షనేత.. డీఎంకే అధినేత కరుణానిధి సైతం అనారోగ్యానికి గురి కావటం తెలిసిందే.
93 ఏళ్ల కరుణానిధి శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు సూచించిన మందుల్ని వేసుకున్నారు. అవి వికటించటంతో ఒళ్లంతా బొబ్బలు రావటం.. తీవ్ర అనారోగ్యానికి గురి కావటం జరిగింది. ఆ సమయంలో ఆసుపత్రిలో చేర్చి.. చికిత్స అందించటంతో కోలుకున్నారు. దాదాపు ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. డిసెంబరు 7 సాయంత్రం డిశ్చార్జ్ చేశారు.
ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం కరుణ అనారోగ్యానికి గురి కావటంతో ఆయన్ను హుటాహుటిన కావేరీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు ఆయన అనారోగ్యం ఎంత తీవ్రంగా ఉందన్న విషయం అర్థమయ్యేలా చేసింది. కరుణ చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రికి డీఎంకే నేతలు ఫెద్ద ఎత్తున తరలిరావటం.. కరుణ కుమార్తె కనిమొళి ఆసుపత్రికి వచ్చి.. ఏడుస్తూ వెళ్లిపోవటం.. కాసేపటికి తిరిగి వచ్చి.. తండ్రిని పరామర్శించటం చేశారు. మరోవైపు కరుణ కుమారుడు అళగిరి తన ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకొని హుటాహుటిన చెన్నైకి వచ్చారు.
పార్టీ నేతలతో పాటు.. వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం కరుణను పరామర్శించేందుకు ఆసుపత్రికి తరలి వచ్చారు. ఇంతకీ కరుణ ఎదుర్కొంటున్న అనారోగ్యం ఏమిటన్న విషయంలోకి వెళితే.. శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న కరుణకు తాజాగా జలుబు.. దగ్గు ఎక్కువై.. శ్వాస పీల్చుకోవటం కష్టంగా మారింది. దీనికి తోడు ఆయనకు గడిచిన 15 రోజులుగా రెయిల్స్ ట్యూబ్ తో ద్రవ పదార్థాల్ని ఆహారంగా అందిస్తున్నారు. ముక్కులో నుంచి ఆహార నాళం ఏర్పాటు చేశారు.
తాజాగా.. తీవ్రమైన జలుబుతో ఆయనకు ముక్కలో నుంచి అమర్చిన ట్యూబ్ ను తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవటానికి తీవ్ర ఇబ్బందులకు గురి కావటంతో.. ట్రక్యోస్టమీ పరికరాన్నిఅమర్చి.. కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. తొంభై ఏళ్ల వయసులో ఒకటికి నాలుగు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కరుణ కోలుకోవాలని.. ఎప్పటి మాదిరి ఆరోగ్యంగా తిరగాలని డీఎంకే నేతలు కోరుకుంటున్నారు. అమ్మ లేని తమిళనాడుకు.. పెద్ద దిక్కుగా కరుణ అవసరం ఉందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/