Begin typing your search above and press return to search.

డేంజ‌ర్‌ లో క‌రుణ ఆరోగ్యం? త‌మిళ‌నాట హైఅలెర్ట్‌

By:  Tupaki Desk   |   27 Sep 2017 8:49 AM GMT
డేంజ‌ర్‌ లో క‌రుణ ఆరోగ్యం? త‌మిళ‌నాట హైఅలెర్ట్‌
X
మ‌ళ్లీ త‌మిళ‌నాడులో ఒక్క‌సారిగా కుదుపు! ఖ‌చ్చితంగా 2016 డిసెంబ‌రు 5వ తారీకునాటి ప‌రిస్థితులు పున‌రావృత‌మ‌య్యాయా? ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వం అలెర్ట్ అయిందా? పోలీసులు `రెడ్ అలెర్ట్‌` అన్న విధంగా ఆంక్ష‌లు విధిస్తున్నారా? రాష్ట్రంలో ఏదో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంటోందా? అంటే తాజా ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గ‌త ఏడాది డిసెంబ‌రులో అమ్మ జ‌య‌ల‌లిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘ‌ట‌న రాష్ట్రాన్ని కుదిపేసింది. ఎక్క‌డిక‌క్క‌డ కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలెర్ట్ అయి ప‌రిస్తితి అదుపు త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నాయి

ఇక‌, ఇప్పుడు కూడా అలాంటి రేంజ్ కాక‌పోయినా అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు మ‌ళ్లీ రాష్ట్రాన్ని కుదిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మాజీ సీఎం - సినీ ర‌చ‌యిత డీఎంకే అధినేత క‌రుణానిధి ఆరోగ్యం బాగా క్షీణించ‌డ‌మే! దాదాపు ఇప్పుడు ఆయ‌న ఆరోగ్యం విష‌మ ప‌రిస్థితికి చేరుకుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త కొన్నాళ్లుగా కేవ‌లం ఇంటికే ప‌రిమిత‌మైన ఆయ‌న త‌న రాజ‌కీయ వార‌సుడిగా స్టాలిన్‌ను రంగంలోకి దింపారు. ప్ర‌స్తుతం ఆయ‌నే డీఎంకే కార్యాచ‌ర‌ణ అధ్య‌క్షుడిగా రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, కొన్నాళ్లుగా ఆరోగ్యం అంతంత మాత్రం కావ‌డంతో క‌రుణ‌పై అప్ప‌ట్లోనే వ‌దంతులు రాజ్య‌మేలాయి.

క‌రుణ‌కు గుర్తింపు స‌న్న‌గిల్లింద‌ని, ఆయ‌న ఎవ‌రినీ గుర్తించ‌లేక‌పోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న ఆహారం కూడా బాగా త‌గ్గించార‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. తాజా ప‌రిణామంతో ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించిన‌ట్టు ప్ర‌భుత్వం కూడా గుర్తించింది. దీంతో ఏక్ష‌ణాన ఏం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న‌తో పూర్తిగా అప్ర‌మ‌త్త‌మైంది. మ‌రి ఈ క్ర‌మంలోనేనా.. అన్న‌ట్టుగా తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు నిన్న హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. దీంతో, ఏదో జరగబోతోందన్న అనుమానం తమిళనాట నెలకొంది. ఇక‌, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం కూడా విషమించింది. సెలవుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని వెంట‌నే విధుల్లో చేరాల‌ని క‌బురు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తానికి ఏదో జ‌రుగుతోంద‌నే వార్త‌లు ప్ర‌స్తుతానికి బ‌ల‌ప‌డుతున్నాయి.