Begin typing your search above and press return to search.

కరుణ సమాధిపై ఏం రాశారంటే..

By:  Tupaki Desk   |   9 Aug 2018 7:12 AM GMT
కరుణ సమాధిపై ఏం రాశారంటే..
X
బతికున్నప్పుడు ఎన్నో సాధిస్తాం..కానీ చనిపోయాక కూడా మనం స్ఫూర్తినివ్వాలని కోరుకోని వారు ఉండరు.. చాలా మంది బతికున్నప్పుడు వివిధ దాన ధర్మాలు.. సంఘ సేవలు చేస్తుంటారు.. కరుణానిధి కూడా అంతే.. బతికున్నప్పుడు ఎలా స్ఫూర్తినిచ్చారో చనిపోయాక తన సమాధిని అంతే స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దాలని కొడుకు స్టాలిన్ సహా కుటుంబ సభ్యులకు వివరించేవాడట.. ఆయన మాటలను గుర్తుపెట్టుకొని ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కరుణానిధి సమాధిని ఆశ్చర్యకరరీతిలో తీర్చిదిద్దారు.

కరుణానిధి అంత్యక్రియలు చెన్నై మెరీనా బీచ్ లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. అశేశ జనవాహిని తరలిరావడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. లాఠీచార్జ్ చేయగా ఘర్ణణలో ఇద్దరు మృతిచెందారు.. 10మంది గాయపడ్డారు. రాజాజీ హాల్ వద్ద గందరగోళ పరిస్థితి తలెత్తడంతో స్టాలిన్ ప్రజలను శాంతియుతంగా ఉండాలని కోరారు.

కాగా మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు పూర్తయ్యాక ఆయన సమాధిపై కుటుంబ సభ్యులు తమిళంలో కొన్ని వ్యాఖ్యలు చెక్కించారు. ‘విశ్రాంతి లేకుండా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి’ అని రాయించారు. ఈ వ్యాఖ్యలను కరుణానిధి తన కొడుకు స్టాలిన్ తో వివరించాడట.. ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి లేకుండా పనిచేసిన గొప్ప నాయకుడు అనుకోవాలి.. అక్కడే సేదతీరుతున్న వ్యక్తి గొప్పతనం తెలిసేలా సమాధిని రూపొందించు’ అని సూచించాడట.. నాన్న కోరిక మేరకే స్టాలిన్ స్ఫూర్తినిచ్చే పదాలను కరుణానిధి సమాధిపై చెక్కించడం విశేషం..