Begin typing your search above and press return to search.

జగన్ మాదిరే కరుణ కూడా చెప్పుకుంటారా?

By:  Tupaki Desk   |   20 May 2016 9:20 AM GMT
జగన్ మాదిరే కరుణ కూడా చెప్పుకుంటారా?
X
చంద్రబాబు సర్కారు మీద విరుచుకుపడే సందర్భంగా ఏపీ విపక్ష నేత తరచూ ఒక మాట చెబుతుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు తమకు మధ్యనున్న ఓట్ల వ్యత్యాసం కేవలం 2.06 శాతం మాత్రమేనని.. మోడీ.. పవన్ దయాదాక్షిణ్యాలతో.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని చెబుతుంటారు. ఎన్ని మాటలు చెప్పినా గెలుపు.. గెలుపే.. ఓటమి ఓటమే. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. కానీ జగన్ ఆవేదనను చూసినప్పుడు మాత్రం అయ్యో.. విజయానికి దగ్గరగా వచ్చి.. వెంట్రుకవాసితో ముఖ్యమంత్రి కుర్చీ మిస్ అయినప్పుడు ఆ మాత్రం బాధ ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు.

అయితే.. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేసే ప్రతి సందర్భంలోనూ తన ఓటమిని చిన్నదిగా చెప్పుకోవటం జగన్ కు ఎక్కువైందన్న విమర్శ పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యవహారాన్ని చూస్తే.. 2 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన జగనే ఇంతలా ఇదైపోతుంటే.. కేవలం ఒక్కశాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన కరుణానిధి ఇంకెంతగా ఫీలవ్వాలో..?

తన ఓటమి సాంకేతికమే తప్ప నిజమైనది కాదని కరుణ చెబుతారా? అన్నది ఆసక్తికర అంశంగా చెప్పాలి. లాజిక్ గా చూస్తే ఆయన మాటను సమర్థించే వారు లేకపోలేదు. ఎందుకంటే.. డీఎంకే సొంతంగా పోటీ చేసిన స్థానాల ఓట్ల మొత్తాన్ని కలిపితే.. అధికారాన్ని సొంతం చేసుకున్న జయలలిత పార్టీకి వచ్చిన సరాసరి ఓట్ల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరి.. జగన్ మాదిరి కరుణ కూడా అదే పనిగా తనకొచ్చిన ఓట్ల శాతాన్ని.. స్వల్ప ఓటమిని ప్రస్తావిస్తారో.. లేక హుందాగా ఉండిపోతారో చూడాలి.