Begin typing your search above and press return to search.
కరుణానిధి.. మన తెలుగు వాడే..
By: Tupaki Desk | 8 Aug 2018 6:50 AM GMTతమిళనాట ఓ శిఖరం రాలిపోయింది. ఎన్నో సంవత్సరాలు తమిళనాడును ఏలిన మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆకస్మిక మరణంతో తమిళనాట విషాధ చాయలు అలుముకున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు కలిసే ఉండేది. మద్రాసు రాజధానిగా ఈ ప్రాంతం పరిపాలన కొనసాగింది. కరుణానిధి పూర్వీకులు తెలుగువాళ్లేనట.. ఆంధ్ర నుంచి వలసవెళ్లి మద్రాసులో సెటిల్ అయ్యాడు. అలాంటి చాలా కుటుంబాలు ఇప్పటికీ తమిళనాడులో ఉన్నారు. కానీ వారి తండ్రులకు తెలుగు తెలుసు.. వారి వారసులైన ఇప్పటి తరం వారు పూర్తిగా తెలుగుకు దూరమై తమిళవాసులుగానే జీవిస్తున్నారు.
అలాంటి తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబాల్లో కరుణానిధి కుటుంబం కూడా ఒకటి. వీరి ఇళ్లలో తాతలు తెలుగు మాట్లాడుకుంటూ ఉంటారు. కరుణానిధి తల్లిదండ్రులకు తెలుగు మాట్లాడేవారని వారి కుటుంబ సన్నిహితులు చెబుతుంటారు.
అయితే విద్యార్థి నుంచి రాజకీయాల్లోకి వచ్చాక కరుణానిధి పూర్తిగా తమిళవాసనలే వంటపట్టించుకున్నారు. తెలుగు మాట్లాడే తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చేవాడే కాని... ఆయన ఎప్పుడు తెలుగుపై శ్రద్ధ చూపలేదు. ఇలా కరుణానిధి తల్లిదండ్రులతోనే వారి తెలుగు అంతమైందనే చెప్పాలి. ఇప్పటి కరుణానిధి వారసుల్లో ఎవరికీ తెలుగు రాదు..