Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ న్యూస్..క‌రుణానిధి అస్త‌మ‌యం!

By:  Tupaki Desk   |   7 Aug 2018 1:29 PM GMT
బ్రేకింగ్ న్యూస్..క‌రుణానిధి అస్త‌మ‌యం!
X
త‌మిళ‌నాట మ‌రో శ‌కం ముగిసింది. డీఎంకే అధినేత - రాజ‌కీయ కురువృద్ధుడు - క‌లైంజ‌ర్ - ఎం.కరుణానిధి (94) అస్త‌మించారు. త‌మిళనాడు రాజ‌కీయ కురువృద్ధుడు - క‌లైంజ‌ర్ క‌రుణానిధి....ఈ రోజు సాయంత్రం 6.10 నిమిషాల‌కు మ‌ర‌ణించిన‌ట్లు కావేరీ వైద్యులు అధికారికంగా ప్ర‌క‌టించారు. కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతోన్న క‌రుణానిధి....ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయ‌న‌ను కాపాడేందుకు తీవ్రంగా శ్ర‌మించామ‌ని - శ‌రీరంలోని అంతర్గత అవయవాలు చికిత్సకు స్పందించ‌ లేద‌ని వారు తెలిపారు. తాము చేయ‌గ‌లిగిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేశామ‌ని అన్నారు. క‌రుణ మ‌ర‌ణ వార్త విన్న త‌ర్వాత కావేరి ఆసుపత్రి వద్ద హై టెన్ష‌న్ ఏర్ప‌డింది. క‌రుణ అభిమానులు - డీఎంకే కార్య‌క‌ర్త‌లు శోక సంద్రంలో మునిగిపోయారు. క‌రుణ‌ను చూసేందుకు డీఎంకే నాయకులు - కార్యకర్తలు భారీగా కార్య‌క‌ర్త‌లు కావేరికి త‌ర‌లి వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలోకే కావేరికి వ‌చ్చే దారిలో కిలోమీట‌ర్ వ‌ర‌కు ట్రాఫిక్ జాం అయింది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కావేరి ఆసుపత్రితో పాటు రాజారత్నం స్టేడియంలో పోలీసులను భారీగా మొహరించారు. మరోవైపు తమిళనాడు డీజీపీ త‌మిళ‌నాడు రాష్ట్రం అంతటా హైఅలర్ట్‌ ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న పోలీసు అధికారులు చెన్నైకి రావాలని - సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. మ‌రోవైపు ఢిల్లీలో ఉన్న తమ రాజ్య స‌భ స‌భ్యులు - ఎంపీలు - నాయకులు చెన్నైకి రావాల్సిందిగా అన్నా అరివాలయం ఆదేశించింది. మ‌రోవైపు - మ‌ద్యం షాపుల‌ను మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. గోపాల‌పురంలోని క‌రుణానిధి ఇంటి వ‌ద్ద కూడా భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. క‌రుణ మ‌ర‌ణ వార్త వెలువ‌డిన నేప‌థ్యంలో త‌మిళ‌నాడు అంత‌టా ఉద్విగ్న వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.