Begin typing your search above and press return to search.
డబ్బులు అవసరమంటున్న మాజీ ముఖ్యమంత్రి
By: Tupaki Desk | 27 Dec 2015 5:03 AM GMTఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఎక్కడెక్కడ దాచిన డబ్బు మూటల్ని సైతం బయటకు తీయాల్సిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఎన్నికలు జరిగిన ప్రతిచోటా ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. పెరిగిన ఖర్చులకు తగినట్లుగా పార్టీ ఫండ్ ను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత కరుణానిధి. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో.. పార్టీ ఎన్నికల నిధిని భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఈ పెద్దమనిషి గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కలెక్షన్లను స్టార్ట్ చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయశారు.
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యంలో.. డీఎంకే పార్టీ ఎన్నికల నిధి అకౌంట్ బాగా చిక్కిపోయిందట. ఇప్పుడా అకౌంట్లో కేవలం రూ.22కోట్లు మాత్రమే ఉన్నాయట. తన రాజకీయ ప్రత్యర్థి అయిన అన్నాడీఎంకే ధనబలంతో పోలిస్తే.. తమ దగ్గరున్న రూ.22కోట్లు ఓమూలకు సరిపోవని.. అందుకే ప్రత్యేక కలెక్షన్ షురూ చేయాలంటూ పార్టీ వర్గాలకు మార్గదర్శనం చేశారు కరుణానిధి. తమ పార్టీ పత్రిక అయిన మురసోలినిలో ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేశారు. పార్టీ వర్గాలు భారీగా నిధులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
పార్టీ ఎన్నికల నిధికి పార్టీ కార్యకర్తలు.. నేతలు మాత్రమే నిధులు ఇవ్వాలని.. పార్టీ ఫండ్ కోసం వ్యాపారస్తులు.. సంపన్నుల దగ్గర విరాళాలు తీసుకోనని చెబుతున్న ఆయన.. పార్టీ ఎన్నికల ఫండ్ పెంచాల్సిన బాధ్యత ఫాలోయర్స్ మీదనే ఉందని చెప్పుకొచ్చారు. అసలే.. అధికారం లేక బక్కచిక్కిపోయిన తమ నుంచి పెద్ద ఎత్తున నిధులు కోరుకోవటం ఎంతవరకు సబబు అని వాపోతున్నారట పార్టీ వర్గాలు. మరి.. అధినేత ఇచ్చిన పిలుపునకు పార్టీ వర్గాల ఎంతలా స్పందిస్తాయో చూడాలి.