Begin typing your search above and press return to search.
హాస్పటల్ బెడ్ పై రజనీ సినిమా చూసిన కరుణ!
By: Tupaki Desk | 24 Dec 2016 11:09 AM GMTగత వారంపది రోజులుగా డీఎంకే చీఫ్ కరుణానిధి హాస్పటల్ లో ఉన్న సంగతి తెలిసిందే. శ్వాసకోస సంబంద వ్యాదులు, గొంతు ఊపిరితిత్తులకు సంబందించిన ఇన్ ఫెక్షన్ తో ఆయన బాదపడ్డారు. దీనిపై డిసెంబర్ 15వ తేదీ నుంచి కావూరీ హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కరుణకు ఇంటిలోనే వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కరుణ కుమారుడు స్టాలిన్... ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.
ఆ సంగతులు అలా ఉంటే కరుణానిధి హాస్పటల్ లో చేసిన ఒక పని ఇప్పుడు చెన్నైలో హాట్ టాపిక్ అయ్యింది. కావూరీ హాస్పటల్ నుంచి అందిన సమాచారం ప్రకారం డిసెంబరు 15న హాస్పటల్ లో అడ్మిట్ అయిన కరుణానిధి ఆ హాస్పటల్ బెడ్ పై నుంచే రజనీకాంత్ సూపర్ డూపర్ హిట్ సినిమా "బాషా" ని ల్యాప్ ట్యాప్ లో చూశారట. అప్పట్లోనే కాదు ఇప్పటీ ఆ సినిమాలో దాగున్న హీరోయిజం చాలా మందికి ఆదర్శం.. కరుణకు కూడా అదే నచ్చిందో ఏమో కానీ... ఆ పరిస్థితుల్లో కూడా కరుణ.. రజనీ సినిమా చూడటం గొప్ప విషయమే.
ఇక కరుణానిధి ఆరోగ్యపరిస్థితిపై స్పందించిన కావూరి హాస్పటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎస్ అరవిందన్.. కరుణ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. శ్వాసకోస సంబంద సమస్యలకు సంబందించిన ట్రీట్ మెంట్ కరుణానిధికి అందించారని, హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి చేరిన కరుణ కు ఇంటిలో కూడా వైద్య సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలో కరుణానిధికి పూర్తి బెడ్ రెస్ట్ అవసరం అని తెలపడంతోపాటు, సందర్శకులెవరినీ ఆయన గదిలోకి అనుమతించొద్దని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/