Begin typing your search above and press return to search.
మజ్లిస్ ఎమ్మెల్యేను బెదిరించినోడ్ని ఎలా పట్టుకున్నారంటే?
By: Tupaki Desk | 5 March 2021 4:46 AM GMT‘రూ.50లక్షలు ఇస్తే సరే.. లేదంటే మీ అబ్బాయిని కిడ్నాప్ చేస్తాం’ అని మజ్లిస్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరించిన వైనం సంచలనమైన విషయం తెలిసిందే. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ ను సెల్ ఫోన్ లో బెదిరించిన అతడెవరు? ఎందుకలా టార్గెట్ చేశాడు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి.. తాజాగా నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన నిందితుడు హకీంపేటలో పెయింటర్ గా పని చేసే 21 ఏళ్ల బిలాల్ గా గుర్తించారు. గతంలో ఎమ్మెల్యే కొడుకు ఫయాజ్ తో.. బిలాల్ కు గొడవ జరిగింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న బిలాల్ పగ తీర్చుకోవాలనుకున్నాడు. గతంలో ఇతడు ఒక హోటల్ లో పని చేశాడు. దీంతో.. అక్కడికి వెళ్లిన బిలాల్.. హోటల్లో దొంగతనం చేశాడు.
ఆ ఫోన్ సాయంతో ఎమ్మెల్యే నెంబరుకు ఫోన్ చేశాడు. రూ.50లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పోలీసుల్ని ఆశ్రయించారు కార్వాన్ ఎమ్మెల్యే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మజ్లిస్ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ నెంబరు ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అతడ్ని రిమాండ్ కు తరలించారు. ఎమ్మెల్యే కొడుకుతో ఉన్న గొడవతోనే తానీ పని చేసినట్లుగా పేర్కొన్నట్లు తెలిసింది.