Begin typing your search above and press return to search.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి చూపు.. ఆ జిల్లా వైపే?
By: Tupaki Desk | 26 Nov 2022 11:30 PM GMTఏపీలో అయితే వైసీపీ.. లేదంటే టీడీపీ.. కానీ తెలంగాణలో అలా కాదు.. అందరినీ ఆదరించేస్తారు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం , కమ్యూనిస్టులు, వైసీపీ కూడా అసెంబ్లీ సీట్లను గత ఎన్నికల్లో గెలిచేశాయి. ఇక్కడ జిల్లాలో ప్రభావం.. పార్టీల తీరు ఆధారపడి ఉంటాయి. అందుకే అంచనావేయడం కష్టం అంటారు.
ఒకప్పుడు తెలంగాణలో టీడీపీ బలంగా ఉండేది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టీడీపీని హైజాక్ చేసి.. చంద్రబాబును 'ఓటుకు నోటు'లో ఇరికించి ఏపీకి సాగనంపారు. తెలంగాణలోని కీలక టీడీపీ నేతలను లాగేసిన కేసీఆర్ ఆ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లేలా చేశాడు.
అయితే పోయిందనుకుంటున్న పార్టీని తిరిగి తెలంగాణలో పునరుద్దరించేందుకు చంద్రబాబు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. కానీ ఇక్కడ మిగిలిన టీడీపీ నేతలు మాత్రం మళ్లీ టీడీపీ కోసం పాటు పడేందుకు ఉనికి చాటేందుకు రెడీ అవుతున్నారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు ఖమ్మం నుంచే పార్టీ బలోపేతం చేసుకొని తనూ ఆ జిల్లాలో పోటీచేసి గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మంలో డిసెంబర్ 212న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబు హాజరవుతారని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాత బస్సు యాత్ర చేస్తామని అంటున్నారు.
ఖమ్మంలో ఏ పార్టీకి సరైన బలం లేదు. అధికార టీఆర్ఎస్ ఇక్కడ కేవలం 1 అసెంబ్లీ సీటునే గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచింది. బీజేపీకి అస్సలు ఉనికే లేదు. అందుకే బలం ఉన్న ఖమ్మంలోనే సత్తా చాటాలని టీడీపీ ఆలోచిస్తోంది.
టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో అందులోకి నేతలు భారీగా చేరారు. వచ్చేసారికి వారికి టికెట్లు దక్కవు. సో దక్కని వారికి టీడీపీలోకి ఆహ్వానించి టికెట్లు ఇవ్వాలని కాసాని ప్లాన్ చేశారు. తెలంగాణలో మళ్లీ సత్తా చాటాలంటే ఖమ్మం బలమైన స్థానమని.. ఇక్కడి నుంచే తనూ పోటీచేయాలని కాసాని కూడా ప్లాన్ చేస్తున్నారు.
చంద్రబాబును తెలంగాణకు రాకుండానే కాసాని అన్నీ చూసుకొని గెలిపించేలా ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు ఖమ్మం జిల్లాలోనూ పోటీచేసి కొన్ని సీట్లు గెలిచి టీడీపీ ఉనికిని కాపాడాలని ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.