Begin typing your search above and press return to search.
కశ్మీర్ ప్రత్యేక దేశమంటున్న మన విద్యాశాఖ
By: Tupaki Desk | 11 Oct 2017 8:54 AM GMTమన సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రమైన జమ్మూకశ్మీర్ గురించి రకరకాల కారణాల వల్ల ఉన్న వివాదాలు మన దేశ పాలకులకు మరే అంశంలో లేవనేది అతిశయోక్తి కాదు. కశ్మీర్‌కు స్వయం పరిపాలన కావాలని, భారత్‌లో విలీనం సరికాదని, ఓటింగ్ నిర్వహించాలని ఇలా రకరకాల డిమాండ్లతో కొన్ని వేర్పాటువాద మూకలు అక్కడ నిత్యం అల్లర్లు సృష్టిస్తూనే ఉన్నాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్ అయితే...కశ్మీర్ లో కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశం, కొన్ని ఉద్దేశపూర్వక వేర్పాటు వాద శక్తులు చేస్తున్న పాక్ ప్రత్యేక దేశం డిమాండ్ ను సాక్షాత్తు మన దేశంలోని విద్యాశాఖ ప్రతిపాదించడం అంటే....అవాక్కయ్యే పరిణామం కదా? సాక్షాత్తు అదే జరిగింది.
బీహార్ విద్యాశాఖ తాజా కలకలానికి కారణం. కశ్మీర్ ఇండియాలో భాగంగా కాదని.. దాన్ని ఒక ప్రత్యేక దేశంగా పరిగణించింది ఆ రాష్ట్ర విద్యాశాఖ. ఏడో తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో.. ఈ ఐదు దేశాల ప్రజలను ఏమని పిలుస్తారని ప్రశ్నించింది. ఆ ప్రశ్నలో చైనా - నేపాల్ - ఇంగ్లండ్ - ఇండియాతో పాటు కశ్మీర్ దేశ ప్రజలను ఏమంటారని అడగడం గమనార్హం. వైశాలి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ప్రశ్నాపత్రంలో ఉన్న తప్పును గ్రహించి.. ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో మీడియాలో ఈ వార్త హల్ చల్ చేసింది.
ఈ సందర్భంగా వైశాలి జిల్లా విద్యాధికారిని మీడియా ప్రశ్నించగా.. తాను సెలవుల్లో ఉన్నానని తెలిపారు. ప్రశ్నాపత్రంలో తప్పు ఎలా జరిగిందో విచారిస్తామని చెప్పారు. బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కౌన్సిల్ అధికారి ప్రేమ్ చంద్రను మీడియా సంప్రదించగా.. జరిగిన పొరపాటు తెలుసన్నారు. దీనిపై విచారణ ప్రారంభించామన్నారు. తప్పు జరిగిందని తాను ఒప్పుకుంటున్నానని చెప్పిన ప్రేమ్ చంద్ర.. ముద్రణ లోపం అయి ఉండొచ్చని పేర్కొన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.