Begin typing your search above and press return to search.
భారతీయ సైనికుడు భావోద్వేగం ఇది!
By: Tupaki Desk | 19 Sep 2016 12:46 PM GMTమనం ఎంచుకున్న శాంతి మార్గమే మనకు శాపంగా మారిన సమయంలో.. మనం అందిస్తున్న స్నేహ హస్తాన్ని మన చేతగానితనంగా శత్రువు భావిస్తున్న తరుణంలో.. సగటు భారతీయుడు ఎలా స్పందిస్తాడు? సైన్యంలో ఉన్న వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడు? రోమాలు నిక్కపొడుచుకునే స్థాయిలో ఒక సైనికుడు గళం విప్పితే ఎలా ఉంటుంది? రొమ్ములు విదిలించిన భారతీయ సైన్యం, శత్రుసైనికుల ఫ్యాంటులు తడిచేలా మాట్లాడితే ఏమవుతుంది? నిద్రపోతున్న వారిపై దాడిచేసి అదేదో గొప్ప విజయంగా భావించుకునే పిరికిపందల చేష్టలపై సైన్యం ఏస్థాయి కోపంతో ఉంది? పంజా విదల్చడానికి సిద్ధంగా ఉన్న సింహం గళం విప్పి గర్జిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చెబుతుంది ఒక వీడియో!
అవును.. "సింహం పిల్లలు తోడేళ్లకు భయపడవు". ఇది సినిమాలో డైలాగు కాదు - నిజమైన హీరోలు చేసిన వ్యాఖ్యలు. "భారతదేశ పరంపర వల్లే కానీ పాకిస్థాన్ కు సొంతంగా గుర్తింపు లేదు.. కశ్మీర్ ఉంటుంది కానీ, పాకిస్థానే ఉండదు.. అణుబాంబులకు మేం భయపడం.. బాంబు పేలుళ్లకు మేం భయపడం.. భయపెట్టాలని చూసే వారి వెన్నులో భయన్నా పుట్టిస్తాం.. నాటి యుద్ధంలో అదృష్టం బాగుండి బతికారు.. కార్గిల్ యుద్ధాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి.. మేం గురిపెడితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి.. మీ ఆటలు ఇక సాగనివ్వం.. తాము తిరగబడితే మిగిలేది బూడిదే.. మట్టికొట్టుకుపోతుంది".. ఈ స్థాయిలో భావోద్వేగంగా సైనికులు మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
భారత సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి యావత్ భారతాన్ని దిగ్భ్రాంత పరిచిన అనంతరం దేశభక్తి నరనరాన జీర్ణించుకున్న సైనికుల మొక్కవోనీ త్యాగాలను కీర్తిస్తూ ఓ భారతీయ సైనికుడు భావోద్వేగంగా ఆలపించిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను కుదిపేస్తున్నది. ఈ వీడియో చూసిన భారతీయూల రోమాలు నిక్కబొడిచేలా చేస్తోంది. "పాకిస్థాన్ శ్రద్ధగా విను... యుద్ధమంటూ వచ్చిందంటే నీ నామరూపాలు ఉండవు".. అంటూ సాగిన ఈ వీడియోను ఎప్పుడు రికార్డు చేశారో తెలియదు కానీ, తాజా ఉగ్రవాద దాడి అనంతరం భారత సైనికులు రగిలిపోతున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది.