Begin typing your search above and press return to search.

కశ్మీర్ పండిట్లు.. బీజేపీకి మద్దతా.? కాదా.?

By:  Tupaki Desk   |   12 Aug 2019 10:03 AM GMT
కశ్మీర్ పండిట్లు.. బీజేపీకి మద్దతా.? కాదా.?
X
భారత దేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత కశ్మీర్ ను సర్వస్వతంత్రంగా పాలించిన రాజు రాజా హరిసింగ్.. కశ్మీర్ ను పాకిస్తాన్ ఆక్రమించడంతో భారత్ శరణు కోరి విలీనం చేశారు. అయితే అనాదిగా కశ్మీర్ లో పండింట్లు లక్షలమంది ఉండేవారు. భారత్-పాక్ మధ్య నలిగిన కశ్మీర్ లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోసి రావణ కాష్టంగా మార్చింది. 1989లో ప్రారంభమైన పాక్ మిలిటెంట్ కార్యకలాపాలతో పక్కా హిందువులైన కశ్మీర్ పండింట్ల కుటుంబాలను టార్గెట్ చేసి దాడులు చేశారు. దాదాపు 219 మంది ఈ దాడుల్లో కశ్మీర్ పండిట్లు చనిపోయారని 2010లో కశ్మీర్ ప్రభుత్వమే తేల్చింది. ఇక ఉగ్రవాదులు పండింట్ల ఇళ్లను తగులబెట్టి దోచుకోవడంతో వారి ధాటికి కశ్మీర్ పండింట్ల అంతా చెట్టుకొకరు పుట్టకొకరు దేశం మొత్తం వలసవెళ్లారు.

అయితే ఇప్పుడు కేంద్రం కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ ను భారత్ లో విలీనం చేసింది. కశ్మీరీలకు ఇప్పుడు కశ్మీర్ పై హక్కులు పోయాయా.? కొత్తగా శక్తి వచ్చిందా అన్న మీమాంసలో కశ్మీరీలున్నారు.. దీని పర్యవసనాలపై తాజాగా కేంద్రంలోని బీజేపీ ఫోకస్ చేసింది.

అయితే అనూహ్యంగా కశ్మీర్ విలీనంపై కశ్మీర్ పండిట్లు మిశ్రమంగా స్పందించారు. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేయడం సబబేనని వారి కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. ఇంతకాలానికి కశ్మీర్ లో అన్యాయమైపోయిన తరిమివేయబడ్డ తమకు న్యాయం జరిగిందని కొందరు పండింట్లు అంటున్నారు ఉగ్రవాదులు - కొందరు ముస్లింలు తమపై చేసిన దాడులకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామని అంటున్నారు.

అయితే మరికొందరు పండింట్లు మాత్రం తాజాగా కేంద్రం అన్యాయం చేసిందని రోడ్డెక్కడం ఆసక్తి రేపుతోంది. తాజాగా 65మంది సభ్యుల కశ్మీర్ కు చెందిన పండిట్లు - డోగ్రాలు - సిక్కులు కేంద్రం కశ్మీర్ ను విభజించడం.. ఆర్టికల్ 370 రద్దు అప్రజాస్వామికం - ఏక పక్షమని రాజ్యాంగ విరుద్దమని ఆందోళన చేయడం గమనార్హం. ఇందులో డాక్టర్లు - జర్నలిస్టులు - సామాజికవేత్తలు కూడా సంతకాలు చేయడం విశేషం. 1949 నాటి కశ్మీర్ నేతలు ప్రత్యేక హక్కుల కోసం ఏర్పాటు చేసిన రక్షణ చర్యలను కేంద్రంలోని బీజేపీ హరించిందని వారు పోరుబాట పట్టారు. దీంతో కశ్మీర్ పండిట్లలోనే ఈ తరహా చీలిపోయి బీజేపీకి అనుకూలంగా.. వ్యతిరేకంగా మారిపోయారు.. దీనిపై బీజేపీలోనూ మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.