Begin typing your search above and press return to search.
కుంకమబొట్టు పెట్టుకొని స్కూల్ కు వచ్చినందుకు దారుణంగా కొట్టారు
By: Tupaki Desk | 7 April 2022 4:53 AM GMTఅప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం జరిగిందని చెప్పిన కశ్మీర్ ఫైల్స్ పై సాగిన రచ్చ గురించి తెలిసిందే. అదంతా అభూతకల్పన అని.. అతిగా చూపించినట్లుగా కొందరు సోకాల్డ్ మేధావులు తెగ వాదనలు వినిపిస్తూ ఆయాసపడిపోయారు. ఓవైపు.. ఈ సినిమాను చూసిన చాలామంది పండిట్లు.. జరిగిన దానితో పోలిస్తే.. సినిమాలో చూపించింది చాలా తక్కువని చెప్పటం.. ఒక నటి తన బాల్యంలో తాను అనుభవించిన ఉదంతాల్ని కళ్లకు కట్టేలా సినిమాలో చూపించారని చెప్పటం తెలిసిందే.
ఇంత చెబుతున్నా.. లౌకికవాదులుగా చెప్పుకునే మేధావి వర్గం.. కశ్మీర్ లో పండిట్లకు జరిగిన దారుణాల మీద ఇప్పటికి ఆవేదన వ్యక్తం చేసే కన్నా.. నాటి దారుణాల్ని తక్కువ చేసి చూపించేందుకు పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం కాదు.. ఇప్పుడు సైతం హిందూ బాలికల విషయంలో జరిగే దారుణాలు ఏ రీతిలో ఉంటాయో తెలుసా? అన్న భావన కలిగే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ జిల్లాలోని ఒక స్కూల్ విద్యార్థిని స్కూల్ కు కుంకం బొట్టు పెట్టుకొని బడికి వెళ్లింది.
అంతే.. కుంకుమబొట్టుతో ఆమెను చూసిన టీచర్ నిసార్ అహ్మద్ కు తీవ్రమైన ఆవేశానికి గురయ్యారు. ఆ విద్యార్థిని చితకబాదేశాడు. దీంతో బాధిత కుటుంబం ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. సోషల్ మీడియాలోనూ తమకు ఎదురైన ఇబ్బందిని వారు ధైర్యంగా చెప్పుకున్నారు. దీంతో.. స్పందించిన విద్యా శాఖ విచారణకు ఆదేశించింది.
సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అవుతున్న వీడియోపై ప్రభుత్వం స్పందించక తప్పనిపరిస్థితి చోటు చేసుకుంది. సదరు టీచర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైరల్ అవుతున్న వీడియోలోని అంశాలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
అప్పటి కశ్మీర్ ఫైల్స్ తర్వాత.. ఇప్పటి కశ్మీరంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండటమా? అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఉదంతానికి మీడియా ఇచ్చిన ప్రయారిటీ ఎంతన్నది చూస్తే.. ప్రధాన మీడియా కొందరి విషయాలకు ఇచ్చే ప్రాధాన్యత.. మిగిలిన వారి సెంటిమెంట్లను ఎందుకంత తక్కువ చేసి చూపిస్తుందన్న భావన కలుగక మానదు.