Begin typing your search above and press return to search.
ఇలాంటి యాడ్స్ కశ్మీరీ పేపర్లలోనే కనిపిస్తాయ్
By: Tupaki Desk | 13 July 2016 3:14 PM GMTకొద్దిరోజులుగా అల్లర్లతో అట్టుడుగుతున్న కశ్మీర్ కు సంబంధించి వార్తలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని మీడియాలలో ప్రముఖంగా దర్శనమిస్తున్నపరిస్థితి. ఎన్ కౌంటర్ తో మొదలైన అల్లర్ల రోజురోజుకీ పెరిగిపోతూ.. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు కశ్మీర్ లోయలో చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. కశ్మీర్ పత్రికల్లో కాస్త చిత్రమైన యాడ్స్ పెద్ద ఎత్తున పబ్లిష్ అవుతున్నాయి. దేశంలో మరే మీడియాలో కనిపించని రీతిలో వింత ప్రకటనలు కనిపించటం విశేషం.
వాస్తవానికి మొన్నటి రంజాన్ పర్వదినం సందర్భంగా కశ్మీర్ లో పెద్ద ఎత్తున వివాహాలు జరగాల్సి ఉంది. అయితే.. అనుకోకుండా వచ్చి పడ్డ అల్లర్లతో ఈవివాహాలన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో.. అప్పటికే పెళ్లిళ్లకు బంధువుల్ని..స్నేహితుల్ని పిలుచుకున్న వారంతా.. తమ పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిన విషయాన్నితెలియజేస్తూ.. ఎవరూ ఫంక్షన్లకు రావొద్దంటూ దినపత్రికల్లో ప్రకటనలు కనిపించటం విశేషం.
నిత్యం దినపత్రికల్లో రకరకాల క్లాసిఫైడ్స్ కనిపిస్తుంటాయి. కానీ.. తమ ఇంట్లో జరగాల్సిన ఫంక్షన్ వాయిదా పడిందని.. ఎవరూ రావొద్దని.. జరిగిన దానికి చింతిస్తున్నట్లుగా పేర్కొంటూ ప్రతి దినపత్రికలోనూ పదుల సంఖ్యలో ఫంక్షన్ క్యాన్సిల్ యాడ్స్ దర్శనం ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.